ఆ సర్వేలో పదేళ్లుగా దీపికా..ఇప్పుడు బన్నీ..వాటే క్రేజ్!

మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN) పోల్ అనేది వివిధ రంగాలలో ప్రజాదరణ పొందిన వారి ప్రభావాన్ని అంచనా వేసే వార్షిక ప్రమాణం. ఇండస్ట్రీలో పలువురు సెలబ్రెటీల పేర్లు ఇప్పటికే హైలెట్ అయ్యాయి. తాజాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో చేరడం హైలెట్ అయింది.

పదేళ్లుగా దీపిక
హీరోయిన్స్ లో బీటౌన్ బ్యూటీ దీపికా పదుకొనె పదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2023లో జరిగిన MOTN పోల్‌లో దీపికా 25 శాతం ఓట్లను సాధించి భారతదేశానికి చెందిన‌ అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన నటిగా తన స్థానాన్ని నిరూపించుకుంది. దీపిక ఈ ఏడాది కూడా నెం.1 స్థానంలో ఉంది. 10 శాతం ఓట్లతో కత్రినా కైఫ్, 9 శాతం ఓట్లతో అలియా భట్, 7 శాతం ఓట్లతో ప్రియాంక చోప్రా జోనాస్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ లు నంబర్ 2గా స్థానంలో నిలిచారు.

నంబర్ వన్ బన్నీ
బిగ్ బి అమితాబ్ బచ్చన్ 27 శాతం, షారుక్ ఖాన్ 22 శాతం, అక్షయ్ కుమార్ 9 శాతం, సల్మాన్ ఖాన్ 8 శాతం, అల్లు అర్జున్ 6 శాతం ఓట్లతో నంబర్ 1గా నిలిచారు. పుష్ప‌రాజ్ పాత్ర‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచ‌ల‌నం సృష్టించాడు. పుష్ప క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందుకుంది. ఈ ఒక్క సినిమాతో జాతీయ అంత‌ర్జాతీయ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. అందుకే ఇప్పుడు మూడ్ ఆఫ్ నేష‌న్ స‌ర్వేలో అల్లు అర్జున్ పేరు అగ్ర స్థానానికి ఎగ‌బాకింది. ఇప్పటి వరకూ జరిగిన సర్వేల్లో తెలుగు నటుల పేర్లు చూడడమే చాలా అరుదు. నేషనల్ అవార్డ్ అందుకున్న ఫస్ట్ తెలుగు హీరోగా మాత్రమే కాకుండా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చోటు దక్కించుకున్న ఫస్ట్ తెలుగు నటుడిగా రికార్డ్ బ్రేక్ చేశాడు.

దీపిక బహుముఖ ప్రజ్ఞకు ఈ గౌరవం
ఇక మూడ్ ఆఫ్ నేష‌న్ స‌ర్వేలో దీపిక పేరు వినిపించ‌డానికి ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉన్నాయి. కేవలం నటిగా మాత్రమే కాదు దాతృత్వ , సామాజిక కార్యక్రమాల్లోనూ దీపిక ప్రత్యేకతే వేరు. ఉత్తమ నటిగా మాత్రమే కాదు సామాజిక స్పృహ కలిగిన హీరోయిన్ గా దీపిక బహుముఖ ప్రజ్ఞకు ఈ గౌరవం లభించింది.