రూ. 80 వేల కోట్లతో తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన రైల్వే లైన్లను కేంద్రం అభివృద్ధి చేయబోతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఈ నిధులు మంజూరుయ్యాయి. రైల్వే ప్రాజెక్టుల నిధులపై కిషన్ రెడ్డి స్వయంగా ప్రకటన చేశారు. ప్రతి జిల్లాను టచ్ అయ్యేలా ప్రణాళికలను కేంద్ర సిద్ధం చేశారు. ఇప్పటికే పెద్దపల్లి మినహా ప్రతి జిల్లా కేంద్రాన్ని కలుపుతూ నేషనల్ హైవేస్‌తో అనుసంధానం జరిగిన విషయం విదితమే. అయితే ఇప్పుడు రైల్వేలతో సైతం అనుసంధానం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
13 వందల కిలోమీటర్ల రైల్వే లైన్
తెలంగాణోల రైల్వేను కేంద్రం ఆధునీకరించడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుటోంది. ఇప్పటికే రైల్వేలతో 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశారు.. 33 జిల్లాలను రైల్వేతో కనెక్టివిటీ చేస్తున్నారు. 13 వందల కిలోమీటర్ల రైల్వే లైన్ల కోసం భూసేకరణ చేస్తున్నారు. హైదరాబాద్-యాదాద్రి లైన్‌ను మంజూరు అయింది. ప్రతి ఏటా 55 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మిస్తున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 2024లో ప్రారంభించే అవకాశం ఉంది. త్వరలో సికింద్రాబాద్-బెంగళూరు వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. 014కు ముందు ఏడాదికి 17.4 కిలోమీటర్ల రైల్వేలైన్ల నిర్మాణం జరిగాయి. నరేంద్రమోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏడాదికి 55 కిలోమీటర్ల రైల్ లైన్ల నిర్మాణం జరుగుతోంది.
రూపు మారనున్న తెలంగాణ రైల్వేలు
తెలంగాణలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు సంబంధించి రైల్వే శాఖ ఆమోదముద్ర వేసింది. ఇందులో 21 స్టేషన్లకు ఆధునీకరణకు ప్రధానమంత్రి గారు వర్చువల్ మోడ్ లో శంకుస్థాపన చేశారు. ఈ 40 స్టేషన్ల ఆధునీకరణ, అభివృద్ధికి కేంద్రం రూ.2,300 కోట్లు విడుదల చేసింది. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి రూ.715 కోట్లు, కాచిగూడ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ. 421 కోట్లు, చర్లపల్లి టర్మినల్ అభివృద్ధికి రూ.221 కోట్లను విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు MMTS-ఫేజ్ 2లో భాగంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. వరంగల్ లో రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతూ.. ఇన్నాళ్లుగా తెలంగాణలో రైలు కూతకోసం ఎదురుచూస్తున్న ప్రాంతాలకు.. రైలు పట్టాలు వేసి అక్కడి ప్రజలకు మరింత సౌలభ్యాన్ని అందించేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే.. రూ. 4,686 కోట్లతో ముద్-ఖేడ్ – మేడ్చల్ మధ్య.. & మహబూబ్‌నగర్ – డోన్ మధ్య రూ. 2,854 కోట్లతో గుంటూరు – బీబీనగర్ మధ్య ఈ 3 ప్రాజెక్టులు ఇప్పటికే మంజూరయ్యాయి. దాదాపు 15 కొత్త ప్రాజెక్టులకు (న్యూ లైన్స్ కోసం) ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) కు కేంద్రప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతోపాటుగా 8 డబ్లింగ్ లైన్లకు, 3 ట్రిప్లింగ్ లైన్లు, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు పచ్చజెండా ఊపింది. ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయి. సర్వే పూర్తవగానే DPR ల పనులు ప్రారంభిస్తారు.
సహకరించని తెలంగాణ ప్రభుత్వం
భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు. రైల్వే విస్తరణ.. రాష్ట్రానికి ఇష్టం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పార్కింగ్‌కు భూమి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదు. చర్లపల్లి కనెక్టివిటీ రోడ్‌కు కూడా రాష్ట్రం స్పందించడంలేదు. MMTS ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు. యాదాద్రి MMTS భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే వెంటనే పర్తవుతుది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం సహకరించని కారణంగా తెలంగాణలో ఇప్పటికే దాదాపు 700 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి తెలంగాణలో అభివృద్ధి ఆగకూడదన్న సంకల్పంతో కేంద్రప్రభుత్వమే భూసేకరణ మొదలుకుని ప్రాజెక్టు పూర్తయ్యేంతవరకు కావాల్సిన ఖర్చులు భరించేందుకు సిద్ధమైంది. అందుకే రూ.83వేల కోట్లతో మెగా డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపిందని కిషన్ రెడ్డి ప్రకటించారు.