రాష్ట్ర రాజకీయాలపై ఆశలు వదిలేసుకుంటున్న చంద్రబాబు జాతీయ రాజకీయాలల్లో చాన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ సమయంలో ఆయన జేపీ నడ్డాతో చాలా సేపు మాట్లాడారు ఏ అంశాలు మాట్లాడారన్నది తెలియదు కానీ.. వారు రాజకీయ నేతలు కాబట్టి రాజకీయాలే మాట్లాడి ఉంటారు. చంద్రబాబు … జాతీయ రాజకీయాలపై మక్కువ చూపినట్లుగా తెలుస్తోంది.
దేశ నిర్మాణంలో భాగం కావడం అంటే ?
దేశ నిర్మాణంలో భాగం కావాలనుకుంటున్నానని అది ఏ రూపంలో అన్నది కాలమే నిర్ణయిస్తుందని ఢిల్లీలో మీడియాతో నిర్వహించి చిచ్ చాట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేరుగా ఆయన ప్రకన చేయలేదు కానీ.. దేశ నిర్మాణం గురించి మాట్లాడారంటే..అది జాతీయ రాజకీయాలే కావొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు ఇప్పటి వరకూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు కానీ నేరుగా ఎప్పుడూ ఢిల్లీ స్థాయిలో పదవులు చేపట్టలేదు. ఏపీ వరకే ఆయన రాజకీయ పదవులు ఉండేవి.కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారా అన్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయి.
మోదీపై ఆపకుండా పొగడ్తలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపిస్తున్నారు. మోడీ భారత్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారున్నారు. వాజ్ పెయి,మన్మోహన్ సింగ్ అంతగా అంతర్జాతీయ పర్యటనలు చేయలేదని గుర్తు చేసారు. భారత దేశం టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. డీప్ డ్రైవ్ టెక్నాలజీస్ వినియోగంలోకి వస్తున్నాయి. వ్యవసాయం, హెల్త్ రంగాల్లో ఈ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు చూడొచ్చన్నారు. భారత్ లో అనంతమైన సౌర శక్తి ఉంది. సౌర, పవన విద్యుత్.. సహా భారత్ కి డెమోగ్రఫిక్ సానుకూలత చాలా ఎక్కువ ఉన్నాయన్నారు. భారత్ కి యువ శక్తి ఉంది. దేశం అభివృద్ధి చెందిన తర్వాత ప్రజలు పిల్లలు వద్దని అనుకుంటారు. అప్పుడు యువ శక్తి తగ్గుతుందని.. అందుకే పాపులేషన్ మేనేజ్ మెంట్ ఉండాలనుకుంటున్నారు .
లోకేష్ కు పార్టీ అప్పచెప్పి తాను ఢిల్లీలో రాజకీయాలు చేయాలనుకుంటున్నారా ?
ఒక వేళ టీడీపీ గెలిచినా ఆయన సీఎంగానే ఉంటారు కానీ.. జాతీయ రాజకీాయల్లోకి వెళ్లలేరు. ఒక వేళ లోకేష్ సమర్థత నిరూపించుకున్నారు కాబట్టి ఆయనకు బ్యాటన్ అప్పగించేసి.. తాను ఢిల్లీ వెళతారా అన్నదానిపై స్పష్టత ఇప్పటికే రాకపోవచ్చు . లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఒక వేళ టీడీపీ గెలిస్తే ఆ గెలుపులో లోకేష్ పాదయాత్రకు మెజార్టీ వాటా ఉంటుందని చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచన ఇప్పటి వరకూ చేయలేదు. జాతీయ రాజకీయాల్లో పదవులు పొందాలని అనుకోలేదు. మరి వచ్చే ఎన్నికల తర్వాత ఏమైనా ఆలోచిస్తున్నారేమో తెలియదు కానీ.. ఆయన మాటలు మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయి.