కాంగ్రెస్ ఉంటే గ్యాస్ బండ ధర రూ. 2వేలు – ఈ లాజిక్ ను ఎవరైనా కాదనగలరా ?

కేంద్రం గ్యాస్ బండ ధరను రెండు వందలు తగ్గించింది. దారిద్ర‌రేఖ‌కు దిగువ‌న ఉన్న నిరుపేద‌లకు 700లకే ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.. ప్ర‌ధాన మంత్రి ఉజ్వ‌ల యోజ‌న ద్వారా బిపిఎల్ ల‌బ్దిదారులు పొందిన గ్యాస్ క‌నెక్ష‌న్ ల‌పై ఎక్కువ స‌బ్సీడీ ఇవ్వాల‌ని క్యాబినేట్ నిర్ణ‌యం తీసుకుంది.. సిలిండ‌ర్ పై రూ 200 స‌బ్బిడీ వెంటనే అమల్లోకి వచ్చింది. కేంద్రం తాజా నిర్ణయంతో ఉజ్వల్ లబ్ధిదారులకు ఇకపై రూ.700లకే సిలిండర్ లభించనుంది. సాధార‌ణ గృహ వినియోగ గ్యాస్ ధ‌ర‌లో కూడా రూ.200 తగ్గించింది..దీంతో గ్యాస్ సిలిండర్ 950 కు లభించనుంది..

గ్యాస్ ధరలపై కేంద్రంపై చాలా కాలంగా దుష్ప్రచారం

కాంగ్రెస్ హయాలో తీసుకు వచ్చిన విధానం ప్ర‌కారం నాలుగు ప్ర‌భుత్వ రంగ గ్యాస్ కంపెనీలు ప్ర‌తి నెల గ్యాస్ ధ‌ర‌ను మార్కెట్ ఆధారంగా త‌గ్గించ‌డ‌మో, పెంచ‌డ‌మో చేస్తున్నాయి.. ఈ విధానం అమ‌లు అయిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు గ్యాస్ ధ‌ర ఒక్క‌సారి కూడా త‌గ్గ‌లేదు.. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ని పరిణామాలు. నిజానికి ఇప్పుడు రేటు రూ. 1150 ఉంది. కానీ పదేళ్ల కిందట ఎంత ఉండేదో తెలుసా.. అందరూ నాలుగు వందల యాభై అని అనుకుంటూ ఉంటారు. కానీ అసలు నిజం మాత్రం వేరే అప్పుడు కూడా గ్యాస్ ధర పడకొండు వందలకుపైగా ఉండేది.

కాంగ్రెస్ హయాంలోనూ సిలిండర్ అదే ధర

బీజేపీ కంటే ముందు ప్రభుత్వాలు సిలిండర్‌ ధరను నిర్ణయించేవి. సబ్సిడీకి కొంత మొత్తాన్ని కేటాయించేవి. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్ల కోటా ఉండేది. ఈ కోటాలో సిలిండర్లకు రాయితీ ఉండేది. అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి సిలిండర్‌ ధర పెరిగితే ఆ భారాన్ని సబ్సిడీ నిధుల్లో నుంచి కేంద్రం భరించేది. చమురు కంపెనీలకు డబ్బు చెల్లించేది. అందువల్ల మార్కెట్‌తో సంబంధం లేకుండా సిలిండర్‌ ధరల్లో స్థిరత్వం ఉండేది. కానీ మార్కెట్‌ పేరుతో ప్రతి నెలా సిలిండర్‌ రేట్లు సవరిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్కో సిలిండర్ పై సబ్సిటీ ఐదు వందలు ఇస్తున్నామని ప్రచారం చేసుకునేవారు. కానీ అదంతా అవినీతి అక్రమాలకే పరిమితమయ్యేది. బీజేపీ వచ్చిన తర్వాత నగదు బదిలీ ప్రారంభించడంతో అసలు లెక్క బయటకు వచ్చింది. అప్పట్లోనూ పదకొండు వందలు ఉన్న ధర ఇప్పుడూ అదే ధరతో ఉంది. పేదలకు ఇప్పటికీ కేంద్రం తక్కువ ధరకు సిలిండర్ ఇస్తూనే ుంది.

పదేళ్ల కిందటి ధర ఇప్పుడు సాధ్యమా ?

ఒక‌ప్పుడు రూ 400ల‌కే ల‌భించే గ్యాస్ సిలెండ‌ర్ ఇప్పుడు ఏకంగా 1150కి చేరిందన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్ల కిందట ఓ వ్యక్తి జీతం ఎంత ఉంటుంది.. ఇప్పుడు ఎంత ఉంటుంది..?.. ధరల్లో మార్పు అనేది సహజమే. దీన్నే ద్రవ్యోల్బణం అంటారు. ఇప్పటికీ కేంద్రం నిరుపేదలకు తక్కువ ధరకు సిలిండర్ ఇస్తోంది. కేవలం ప్రజలు పన్నులుగా కట్టే సొమ్మును సద్వినియోగం చేసేందుకు .. . అసలైన ధరకు ఇస్తోంది. అంతర్జాతీయంగా… అనుసరిస్తున్న వ్యూహాల కారణంగా సిలిండర్ రేటు స్థిరంగా ఉంది.

కాంగ్రెస్ ఉండి ఉంటే రెండు వేలు పైనే !

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే… సిలిండర్ రేటు రెండు వేలు దాటి ఉండేదని ఆర్థిక నిపుణులు లెక్కలు చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో సిలిండర్ రేటు అప్పటి ధరలతో పోలిస్తే చాలా ఎక్కువ. పైగా కాంగ్రెస్ చేతకానితనంతో… అంతర్జాతీయ ఒప్పందాల వల్ల పెద్దగా తెలివిగా వ్యవహరించకపోవడం వల్ల చవకగా చమురు కొనే పరిస్థితి ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ ఎక్కడ ఆగిందో ధరలు అక్కడే ఉంటాయని ప్రచారం చేసుకుని ప్రజల్ని మాత్రం మభ్యపెడుతూ ఉంటారు