భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ – నాసాలు వచ్చే ఏడాది ఉమ్మడిగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ – ఐఎస్ఎస్కు అంతరిక్ష యాత్రను చేపట్టనున్నాయి. అర్టెమిస్ ప్రయోగం కింద రెండు దేశాలు సంయుక్తంగా అద్భుత ప్రయోగాలు చేస్తాయి. 50 ఏళ్ల క్రితమే చంద్రుడిపై జెండా పాతినా.. ఆ తర్వాత చాలా మంది వ్యోమగాములు వెళ్లి వచ్చినా పెద్దగా పురోగతి సాధించలేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందిన సమయంలో ప్రస్తుతం చంద్రుడి గురించి నిగూఢ రహస్యాలు ఛేదించేందుకు ప్రపంచ దేశాలు సిద్ధం అవుతున్నాయి. చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో భారత్ శక్తి ఏమిటో అమెరికా నాసాకు తెలిసి వచ్చింది.
అపోలో ప్రాజెక్ట్ తర్వాత అమెరికా చేస్తున్న అతి పెద్ద ప్రయోగం
అపోలో ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాములు అక్కడ ఒక జెండాను పెట్టి భూమికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం చేపట్టబోయే అర్టెమిస్ ప్రయోగంలో చాలాకాలం పాటు వ్యోమగాములు అక్కడే ఉండనున్నారు. వాటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి. ఇది భూ గ్రహం కాకుండా వేరే గ్రహాల్లో మానవులు జీవించడానికి అవసరమైన పరిశోధనలకు నాసా కృషి చేస్తోంది. ఉదాహరణకు.. జాబిల్లిపై విద్యుత్ వైర్లను రోబోల సాయంతో కిలోమీటరు పొడవున వేయడానికి ఆస్ట్రోబోటిక్ అనే కంపెనీతో నాసా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో విద్యుదుత్పత్తి, పంపిణీ, హైవోల్టేజ్ పవర్ కన్వర్టర్ లాంటివి ఏర్పాటు చేయవచ్చు.
చంద్రుడ్ని దగ్గర చేస్తున్న ఇస్రో
ఒక్కో విజయం సాధిస్తూ ఇస్రో ముందు కెళ్తోంది. తదుపరి ప్రయోగాల్లో మానవ సహిత అంతరిక్ష నౌక ను పంపి స్తారు. గతంలో వ్యోమ గాములను చంద్రుడిపైకి పంపిన నాసా 2025 నాటికి దక్షిణ్రధువంపై అడుగిడేలా ప్రణాళికలు సిద్ధంచేసింది. అంటే.. భారత్ తో పాటు ప్రపంచంలోని అగ్రదేశాలు కూడా ఈ మిషన్ లో పోటీ పడుతున్నాయి. ఆయా దేశాలకు ఉన్న వనరులు వేరు.. మన దేశానికి ఉన్న వనరులు వేరు. అమెరికాలో అమెజాన్, టెస్లా ఓనర్లు ప్రత్యేకంగా మూన్ మిషన్లు చేపట్టి నాసాతో కలిసి పని చేస్తున్నారు. కానీ భారత్ లో అంతగా అంతరిక్షంపై పెట్టుబడి పెట్టే వ్యాపారవేత్తలు రెడీ కాలేదు. ఇప్పుడు బయట నుంచి పెట్టుబడుల వెల్లువ వస్తుంది. అంతర్గత స్టార్టప్‌లు పెరుగుతాయి. మొత్తంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మేర వ్యాపారం జరుగుతుందని అంచనాలుఉన్నాయి.
మేడిన్ ఇండియా బ్రాండ్ ఇక విశ్వవ్యాప్తం
భారత్ అంతరిక్ష మార్కెట్ లో ఎవరూ ఊహించనంత గొప్ప స్థానం పొంతబోతోంది. మన ఓ రకంగా స్పేస్ విషయంలో మేడిన్ ఇండియా బ్రాండ్ నే ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. చంద్రయాన్ పూర్తిగా మెడిన్ ఇండియా. రోవర్ , ల్యాండర్ మొత్తం ఇస్రో శాస్త్రవేత్తలే రూపొందించారు. అందుకే ఈ విజయం మరింత అపురూపం. పరిశోధనలు చేసి.. మేడిన్ ఇండియా బ్రాండ్ లతోనే అంతరిక్ష ప్రయోగాలు చేస్తోంది. అనూహ్యమైన విజయాలు సాధిస్తోంది. అందుకే.. భారత్ ఇవ్వబోయే అంతరిక్ష సేవల పట్ల ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. మూన్ మిషన్ లో ఇక భారత్ పాత్రను ఎవరూ తక్కువ చేయలేరు. ఇంకా చెప్పాలంటే.. మనమే చంద్రునపై చేరుకునే మిషన్లకు నాయకత్వం వహించవచ్చు. అంటే.. ఇటు సాంకేతిక పరంగా..అటు వ్యాపార పరంగా దేశం అద్భుతమైన ప్రగతి సాధించడానికి ముందడుగుపడినట్లే. ప్రపంచ పటంలో ప్రముఖంగా ఉన్నట్లే.