హరీష్ టార్గెట్‌గా బీఆర్ఎస్‌లో అసలు రాజకీయం – మైనంపల్లి వెనుక ఉన్న ది కేటీఆరా ?

తెలంగాణ రాష్ట్ర సమితిలో రాజకీయాలు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. అయినా ఆయనకు టిక్కెట్ ప్రకటించారు. దీంతో మరింతగా మైనంపల్లి చెలరేగిపోయారు. అయితే.. పార్టీలో ఒక్కరూ మైనంపల్లి పై మాట్లాడలేదు. అమెరికాలో ఉండి కేటీఆర్ చాలా తీరిగ్గా స్పందించారు. మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు. పార్టీకి చాలా కాలంగా పిల్లర్ లా ఉన్నారని హరీష్ రావు గురించి చెప్పుకొచ్చారు. తర్వాత కవిత కూడా స్పందించారు. కానీ మైనంపల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఎందుకు టిక్కెట్ కేటాయించారు ?

హరీష్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ఉదయమే ఆయన వ్యాఖ్యలు చేసినా మధ్యాహ్నం ప్రకటించిన జాబితాలో మైనంపల్లి పేరు ఉంది. ఇదంతా కేటీఆర్ వ్యూహాత్మకంగా చేస్తున్నారని బీఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ మాస్టర్ ప్లాన్ లో భాగంగానే అంతా జరుగుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. మైనంపల్లిపై కేసీఆర్ సీరియస్ అని కొత్తగా మీడియాకు లీకులిచ్చారుకానీ.. ఆ కామెంట్లు చేసినప్పుడు లేని సీరియస్ .. కొత్తగా ఎందుకు వచ్చిందన్నది కీలకం.

హరీష్ ను పార్టీ నుంచి పంపేసే ప్లాన్ ?

వచ్చే ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ.. హరీష్ రావు మాత్రం పార్టీలో ఉంటే.. కేటీఆర్ నాయకత్వాన్ని ఎవరూ దేకరని కేసీఆర్ కు తెలుసని అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరిలో ఎవరు అంటే.. 90 శాతం మంది హరీష్ రావు పేరే చెబుతారు. హరీష్ రాజకీయాల ముందు కేటీఆర్ తేలిపోతారు. గతంలో గెలిచిన తర్వాతనే హరీష్ కు మంత్రి పదవి ఇవ్వలేదు. ఈటలరాజేందర్ ను పార్టీ నుంచి బయటకు పంపిన తర్వాతనే ప్రాధాన్యం ఇచ్చారు. అప్పుడే ఈటల కూడా చెప్పారు. తన గతే .. హరీష్ కు పడుతుందని. ఇప్పుడు అదే నిజం చేసేందుకు.. తెర వెనుక పప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంి. ల

హరీష్ ఏం చేస్తారు ?

హరీష్ రావుపై మైనంపల్లి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు పెద్దగా ఖండించకపోవడానికి కారణాలు ఉన్నాయి. ఖండిస్తే.. కేసీఆర్, కేటీఆర్ కు కోపం వస్తుంది. వారి రాజకీయంలో తాము చొరబడటం ఎందుకని ఆలోచిస్తున్నారు. ఖండిస్తున్నరు. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను పార్టీ పట్టించుకోలేదని ఇప్పటికే తేలిపోయింది. మైనంపల్లి తన కుమారుడికి టిక్కెట్ విషయంలో తగ్గే అవకాశం లేదని.. ఆయన పార్టీ మారిపోవడం ఖాయమని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నయి. కానీ చివరిలో అసలు ట్విస్ట్ ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా హరీష్ టార్గెట్ గానే బీఆర్ఎస్ లో రాజకీయాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.