ఏపీ బీజేపీపై మరోసారి కుట్ర – ఓ వర్గం మీడియాకు లీకుల వెనుక ఉన్నదెవరు ?

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. పార్టీలోని అంతర్గత విషయాలపై మీడియాకు తప్పుడు సమాచారం లీక్ చేస్తున్నారు. తాజాగా ఓ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలో… ఏపీ బీజేపీలో నిధుల గోల్ మాల్ జరిగిందని.. రికవరీ చేస్తున్నారని రాసుకొచ్చారు. ప్రతీ పార్టీ కూడా ఖర్చులు పెడుతుంది. ఆ ఖర్చులపై లెక్కలు నేతలూ ఇస్తారు. అదంతా కామన్ ప్రాసెస్. అన్ని పార్టీల్లోనే ఉంటుంది. కానీ బీజేపీలోనే ఇలా జరుగుతోందని ప్రచారం చేయడం వెనుక ఓ క్రమబద్ధమైన కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీ కార్యాలయం కోసం కొన్న స్థలంపై ఓ వర్గ మీడియాకు ఎందుకంత ఉలుకు ?

తాడేపల్లిలో బీజేపీ ఏపీ కార్యాలయం కోసం స్థలం కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు జరిగినప్పుడు అప్పటి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యక్తిగతంగా ఆస్థలం కబ్జా చేశారన్నట్లుగా ప్రచారం చేశారు. రాజకీయకారణాలతో.. ఆ స్థలం డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నా కొంత మంది ఆందోళన చేశారు. ఈ వివాదం ఇంకా నడుస్తోంది. అయితే ఇందులో మూడున్నర కోట్లు గోల్ మాల్ జరిగిందని… మీడియాకు లీక్ చేశారు. నిజమేంటో ఆ పార్టీ నేతలకు తెలుసు. కానీ వారు బయట ఈ విషయాలు మాట్లాడలేరు. అవి అంతర్గత విషయాలు. కానీ ప్రజల్లోకి మాత్రం.. బీజేపీ నేతలపై ఇలాంటి మరకలు వేయడానికి ఏపీ బీజేపీలోనే కొంత మంది లీకులు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కన్నా అధ్యక్షునిగా ఉన్నప్పుడూ ఇదే తరహా ఆరోపణలు

గతంలో ఎన్నికల నిధుల్ని దుర్వినియోగం చేశారని కన్నా లక్ష్మినారాయణపై వైసీపీ నేతలు ఆరోపించేవారు. విజయసాయిరెడ్డి ఇలాంటి ఆరోపణలు చేసేవారు. బీజేపీ అంతర్గత విషయాల్లో వైసీపీ జోక్యం ఏమిటని అప్పుడే చాలా మంది తప్పు పట్టారు. కేవలం బీజేపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇలా చేశారన్న వాదనలు వినిపించాయి. తరవాత అంతా సైలెంట్ అయ్యారు. మరోసారి అదే తరహా కుట్రను బీజేపీపై పన్నుతున్నారా అన్న అనుమానాలు ఎక్కువగా ఉంటున్నాయి.

ఏపీ బీజేపీలో అంతర్గత శత్రువులు పెరిగిపోయారా ?

ఏపీ బీజేపీ ఎదగకుండా అనేక మంది అనేక రకాల కుట్రలు చేస్తూంటారు. తమ మనుషుల్ని బీజేపీలోకి పంపించి… సమాచారం సేకరించి.. దాన్ని తమకు అనువైన రీతిలో మీడియాలో ప్రచారం చేయించి.. ఆ పార్టీ నేతల ఇమేజ్ ను నాశనం చేసే ప్రయత్నం చేస్తూంటారు . ఇటీవల ఈ కుుట్రలు ఇంకా పెరిగిపోయాయనని.. బీజేపీలోని పుట్టి.. బీజేపీలో పెరిగిన నేతలపై భారీ కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.