జుట్టు చిట్లిపోతోందా..ఈ సింపుల్ చిట్కా పాటిస్తే తగ్గిపోతుంది

పొడుగైన, ఒత్తైన జుట్టు ఉంటే బావుండును అని అనుకోని మగువలు ఉండరు. జుట్టు ఆరోగ్యంగా , అందంగా ఉండేందుకు చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. అయినప్పటికీ కొందరి జుట్టు చివర్లు అలా చిట్లిపోతూనే ఉంటాయి. కట్ చేయడమే పరిష్కారం అనుకోవద్దు..కొన్ని కొన్ని ఇంటి చిట్కాలతో కూడా ఈ సమస్యకు సులభంగా చెక్‌ పెట్టవచ్చంటారు నిపుణులు. జుట్టు చిట్లిపోవడం అనే సమస్య చాలామందికి ఉంటుంది. వాతావరణంలో కాలుష్యం పెరగడం, తీసుకునే ఆహారం ప్రధాన కారణం. ఈ సమస్యతోనే ఒత్తైన అందమైన జుట్టు రాలిపోతోంది, పురుషుల్లో ఎక్కువ మందికి బట్టతల సమస్యలొస్తున్నాయి. వేడి నీటి స్నానం, హెయిర్ కి కలర్స్ వేయడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా జుట్టు చిట్లే సమస్య నుంచి బయటపడేందుకు కట్ చేస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు కట్ చేసినా కానీ మళ్లీ మళ్లీ జుట్టు చిట్లిపోతూనే ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి?. ఉల్లిగడ్డ-పెరుగు-అలోవెరా ఒక ఉల్లిగడ్డను తీసుకుని పీల్ తీసి నీటిగా కడిగి ముక్కలుగా కోసి మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన పేస్ట్ నుంచి ఉల్లి రసాన్ని సెపరేట్ చేయాలి. ఆ రసంలో పెరుగు, అలోవేరా జెల్ , ఆవనూనె వేసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించి ఓ గంటసేపటి తర్వాత షాంపు చేసుకోవాలి. జుట్టు చివర్ల పగుళ్లు ఎక్కువగా ఉంటే వారానికి రెండుసార్లు ఇలా చేయాలి. వారానికి ఓసారి ఈ చిట్కా పాటించడం ద్వారా అసలు జుట్టు పగుళ్లేరాకుండా చూసుకోవచ్చు. పెరుగు-తేనె తేనె నేరుగా జుట్టుకి అప్లై చేస్తే తెల్లగా అయిపోతుందంటారు. పెరుగుతో కలసి అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారని చెబుతున్నారు నిపుణులు. అరకప్పు పెరుగు, 6 చెంచాల తేనె మిక్స్‌ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు బాగా కలుపుకుని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత ఒక గంట పాటు ఆరనివ్వండి. ఇలా ఆరిన తర్వాత జుట్టును సాధరణ షాంపూతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇలా చేయకండి జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వకూడదు.వేడి వేడి నీటితో కాకుండా గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి, ఎండలో తిరిగేట‌ప్పుడు జుట్టును క‌వ‌ర్ చేసుకోండి.హెయిర్ స్ట్రెయిటెనర్‌, హెయిర్ డ్రయర్ వినియోగం సైతం త‌గ్గించడం మంచిది గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.