తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి వేల కోట్లు – రాజకీయాలకు అతీతంగా బీజేపీ పాలన !

అధికారంలోకి రావడానికి రాజకీయం చేయవచ్చు కానీ.. అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదన్నది అందరూ రాజకీయంలో పాటించాల్సిన నీతి. ఇతర పార్టీలేం చేశాయో చరిత్రలో చూశాం .. .ఇప్పుడు బీజేపీ ఆ రాజనీతిని పక్కాగా పాటిస్తోంది. బీజేపీని ఆదరిస్తున్నారా లేదా అన్న విషయాలను పట్టించుకోకుడా నిధులను కేటాయించి… అభివృద్ధి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన కేంద్రం.. తాజాగా రైల్వే లైన్ల అభివృద్ది కోసం మూడు వేల కోట్లకు కోట్లు కేటాయించింది.

తెలుగు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు

తెలుగు రాష్ట్రాల్లో రైల్వేలైన్ల అభివృద్ధికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు -బీబీనగర్ మధ్య ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్‌లో 239 కిమీ రైల్వే లైన్ డబ్లింగ్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం, దీనికోసం రూ. 3238 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే హైదరాబాద్‌చెన్నై మధ్య 76 కిమీ దూరం తగ్గనుంది. మరోవైపు రూ. 5655.4 కోట్ల అంచనా వ్యయంతో ముద్కేడ్‌మేడ్చల్, మహబూబ్‌నగర్‌డోన్ మధ్య రైల్వేలైన్ ( 502. 34 కిమీ ) డబ్లింగ్‌కు ఆమోదం లభించింది. తద్వారా హైదరాబాద్‌బెంగళూరు మధ్య 50 కిమీ దూరం తగ్గనుంది. మరోవైపు ఏపీలో నెర్గుండి బారాంగ్, ఖుర్దారోడ్ విజయనగరం మధ్య (417.6 కిమీ)రూ. 5618 26 కోట్ల అంచనా వ్యయంతో మూడో రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే విశాఖ పట్నంచెన్నై మధ్య మూడోరైల్వే లైన్ డీపీఆర్ సిద్ధం కాగా, మూడు వేల కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు జరగనున్నాయి.

బడ్జెట్‌లోనే భారీ కేటాయింపులు

ఉభయ తెలుగు రాష్ట్రాలకు రూ.12,824 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. బడ్జెట్ లో ఏపీకి రూ.8,406 కోట్లు, తెలంగాణకు రూ.4,418 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వే లైన్ల డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు చేపడుతన్నారు. బ్రిడ్జిలు, అండర్ పాస్ లు నిర్మిస్తారు. రైల్వే ప్రాజెక్టుల పూర్తికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సహకరించాల్సి ఉంది. హైస్పీడ్ రైళ్లపై అధ్యయనం చేస్తున్నారు. కాజీపేటలో వ్యాగన్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ఇటీవల రైల్వే స్టేషన్ల అభివృద్ధికి మోదీ శంకుస్థాపనలు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో వీటిని నిర్మించబోతున్నారు.

నిబంధనల ప్రకారం కేటాయించిన చిన్న మొత్తాలుకూడా కేటాయించని ప్రభుత్వాలు

రైల్వేల అభివృద్ధికి వేల కోట్లు ఇస్తూంటే.. మ్యాచింగ్ గ్రాంట్ గా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టాల్సిన చిన్న మొత్తాలను ఇవ్వకపోవడంతో చాలా ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులు అయిన వాటికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిధులు ఇవ్వడం లేదు. ఫలితంగా వేల కోట్ల ప్రాజెక్టుల పనులు మందకొడిగా సాగుతున్ాయి. ఈ విషయంలోనూ ప్రభుత్వాలు శ్రద్ద చూపితే… రైల్వే ప్రాజెక్టుల్లో దేశంలోని తెలుగు రాష్ట్రాల నెంబర్ వన్ గా ఉంటాయి.