తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు ఒకటేనని.. తేటతెల్లమవుతోంది. జాతీయ స్థాయిలో I.N.D.I.A పేరుతో కూటమి ఏర్పాటు చేసుకుని అందులో కాంగ్రెస్, కమ్యూనిస్టులు భాగం అయ్యారు. కానీ బీఆర్ఎస్ లోపాయికారీ రాజకీయాలు చేస్తోంది. ఇప్పుడు తెలంగాణలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో కాకుండా బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదంతా బీజేపీని దెబ్బకొట్టే వ్యూహామే.
కమ్యూనిస్టులతో పొత్తుకు బీఆర్ఎస్ రెడీ
కమ్యూనిస్టుపార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేసతున్నాయి. దక్షిణ తెలంగాణలో కమ్యూనిస్టులకుప్రతి నియోజకవర్గంలో కనీసం ఐదు వేల ఓట్లు ఉంటాయని బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పది వేల ఓట్లు ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో ఇవే కీలకం అయ్యే అవకాశాలు ఉన్నాయి. టఫ్ ఫైట్ ఉంటుందని రిపోర్టులు వస్తూండటంతో… కమ్యూనిస్టులకు కొన్ని సీట్లు ఇచ్చి అయినా పొత్తులు పెట్టుకోవాలనుకుంటున్నారని అంటున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో సాలిడ్ ఓటు బ్యాంక్ ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కమ్యూనిస్టులతో కమ్యూనికేషన్ ను కేసీఆర్ నిలిపివేశారు. ఈ అంశంపై కమ్యూనిస్టుపార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. అయితే మళ్లీ కేసీఆర్ మనసు మార్చుకున్నారని.. కమ్యూనిస్టులతో పొత్తులకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి.
దక్షిణ తెలంగాణలో బీజేపీని దెబ్బకొట్టే వ్యూహం
సీపీఐ, సీపీఎం పార్టీలకు న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధినేత అంచనా వేస్తున్నారు. ఈ సారి కూడా కనీసం మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గత రెండు ఎన్నికల్లోనూ ఒక్క సీటు కంటే ఎక్కువ దక్కించకోలేకపోయారు. అక్కడ తక్కువలో తక్కువగా ప్రతి నియోజకవర్గంలో 5 వేల వరకు ఓట్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నాయి. ఈ ఓట్లు గెలుపోటముల్ని తేలుస్తాయని నమ్ముతున్నారు. బీఆర్ఎస్ పరిస్థితి గడ్డుగా ఉంది.. విడివిడిగా పోటీ చేస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీకి మళ్లుతాయి. అందుకే.. కమ్యూనిస్టుల ఓట్లు బీఆర్ఎస్ కు చేరేలా చేస్తే.. బీజేపీని దెబ్బకొట్టవచ్చని భావిస్తున్నారు.
దేశంలో కాంగ్రెస్… రాష్ట్రంలో బీఆర్ఎస్.. లోపాయికారీగా మూడు పార్టీల కూటమి
బీఆర్ఎస్ పార్టీ .. జాతీయ స్థాయిలో తము ఏ కూటమిలో లేమని చెబుతోంది కానీ.. కాంగ్రెస్ కూటమి బాటలోనే నడుస్తోంది. కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసింది. జాతీయ. స్థాయిలో కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటోంది. తెలంగాణలో రెండు పార్టీలు కలిసి పని చేస్తే .. బండారం బయటపడుతుందంని… రాజకీయ నాటకాలు ఆడుతున్నాయి. ఎన్నికల తర్వాత ఈ మూడు పార్టీలు ఒకే కూటమిలో ఉండే అవకాశం ఉంది.