కంచి కామాక్షిని దర్శించుకోవాలనుకుంటే అమ్మ అనుగ్రహం ఉండాలి!

మనదేశంలో అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కంచి కామాక్షి ఆలయం. తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం జిల్లా శివకంచిలో కామాక్షి దేవి కొలువై ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంటే జరిగిపోదు మనపై అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆ శక్తిపీఠాన్ని చేరుకోగలం అంటారు పండితులు.

కంచి కామాక్షి ఆలయంలో అమ్మవారు మరే ఆలయంలోనూ లేని విధంగా యోగముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుంది.
కేవలం కామాక్షి అమ్మవారి ఆలయం తప్ప మనకు శివకంచిలో మరే ఇతర అమ్మవారి ఆలయాలు కనిపించవు. పురాణాల ప్రకారం అమ్మవారు వివిధ శక్తి రూపాల్లోని శక్తి నంతటిని గ్రహించి మన్మధునిలో ఆవహింప చేసిందని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా ప్రతి ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వామివారి విగ్రహం పక్కనే ఉండి భక్తులకు దర్శనమిస్తుంటారు. కాని ఈ ఆలయంలో అమ్మవారు మాత్రమే దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఏకామ్రేశ్వరస్వామి ఆలయం ఉంటుంది. అమ్మ వారికి చెందిన బీజాక్షరాలతో రచించిన యంత్రాన్ని అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఉంచి పూజలు చేస్తారు.

కామాక్షి తల్లిని దర్శించుకోవాలంటే అమ్మ అనుగ్రహం ఉండాలి
ప్రపంచానికి నాభి స్థానం కాంచీపురం కామక్షి తల్లి దేవాలయం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాభి నుంచి బిడ్డకు పోషకాలు అందుతాయని, బిడ్డలందర్నీ అమ్మ ఇక్కడి నుంచి కాపాడుతుందని చెబుతారు. సుగంధ కుంతలాంబ అవతారంలో దర్శనమిచ్చే కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నాక కుంకుమ తీసుకుంటే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఢంకా వినాయకుడు ఇక్కడ దర్శనం ఇస్తారు. పరమేశ్వరుడిని భక్తగా పొందేందుకు కాత్యాయనీ దేవి తపస్సు చేసిన ప్రదేశం కాంచిపురం . ఇక్కడ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకునే తీరని కోరికలు ఉండవనేది భక్తుల విశ్వాసం.
“శోకాపహంత్రీ సతాం”
అనే పవిత్రమైన పదం గురించి వర్ణణ వివరంగా ఉంది. సతతం మనః శుద్ధితో కామాక్షిదేవి ధ్యానించే వాళ్ళుంటారో వారికి అమ్మ ఎప్పుడూ సుఖసంతోషాలను ప్రదర్శిస్తుందని దీని అర్థం.

ప్రతి రోజూ ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నరవరకూ , సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకూ ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.