ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన ‘ది వరల్డ్ ఇన్ 2050’ నివేదిక ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న జాబితాలో ఉన్న 7 దేశాలలో 6 దేశాలు ఇంకో 30 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చేరుతాయని పేర్కొంది. అమెరికా రెండవ స్థానం నుంచి 3వ స్థానానికి , జపాన్ 4 నుంచి 8వ స్థానానికి జర్మనీ 5 నుంచి 9 వ స్థానాని పడిపోతాయని వ్యాఖ్యానించింది. వియత్నాం, ఫిలిప్పీన్స్, నైజీరియా లాంటి ఆర్ధిక వ్యవస్థలు కూడా మరో 30 ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందుతాయని ఈ నివేదిక చెప్పింది. ఈ నివేదిక ప్రకారం భారత్ రెండో స్థానానికి చేరుతుంది. 2020లో వచ్చిన ఈ నివేదిక ఇప్పుడు నిజమని నిరూపించే దిశగా సాగుతోంది.
2050 కల్లా అమెరికాను దాటిపోనున్న భారత్
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవ స్థానంలో ఉన్న భారత దేశం మరో మూడు దశాబ్దాల్లో ఏటా సగటున 5 శాతం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదలతో గణనీయంగా ఆర్ధిక అభివృద్ధి సాధించనుందని నివేదిక పేర్కొంది. మూడేళ్ల కిందట వచ్చిన ఈ నివేదిక తో పోలిస్తే భారత్ అభివృద్ధి ఇంకా ఎక్కువగా ఉంది. 2050 కల్లా భారతదేశం, అమెరికాను అధిగమించి ప్రపంచ స్థూల జాతీయ ఉత్పత్తిలో 15 శాతం వాటాతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్లో రెండవ స్థానంలో నిలుస్తుందని అంచనా వేసింది. ఈ అభివృద్ధి ఫలాలు ఇప్పటికే ప్రజలకు చేరడం ప్రారంభమైంది.20వ శతాబ్దం చివర నుంచి 21వ శతాబ్దం ఆరంభం వరకు నా కళ్ళ ముందు దేశ స్వరూపం సమూలంగా మారిపోతోంది.
మెరుగుపడిన ప్రజల జీవన ప్రమాణాలు
ఆర్ధిక రంగంలో చోటు చేసుకున్న మార్పులు ప్రజల జీవన విధానంలో, నగర జీవితంలో, దేశ పౌరుల నడవడిక, అలవాట్లలో అనేక మార్పులు తెచ్చాయి. ఉదాహరణకు గత 15 ఏళ్లలో ప్రజలు వాడుతున్న టీవీ సెట్లలో, కారు బ్రాండ్లలో, మొబైల్ ఫోన్ నాణ్యతలో అనేక మార్పులు చోటు చేసుకున్న విషయం కళ్ల ముందే ుంది. విమాన ప్రయాణాలు చాలా మందికి అందుబాటులోకి రావడమే కాకుండా, చాలామంది ఖరీదైన , విలాసవంతమైన భవనాలలో నివసిస్తున్నారు. ఈ అభివృద్ధి అంత సులభంగా జరగలేదు. అయితే అభివృద్ది అనేది నిత్యం జరగాల్సింది. అందరూ ఒకే సారి అభివృద్ధి చెందలేరు. కానీ వచ్చే ముప్పై ఏళ్ల నాటికి ప్రజలందరూ అభివృద్ది చెందిన .. కుటుంబాల జాబితాలోకి వస్తారు.
అమృత్ కాల్ లక్ష్యాలు పెట్టుకున్న మోదీ
వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75 వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రకటించారు. ఇది ఆషామాషీ ప్రకటన కాదు. సంకల్పం. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేర్చడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది రాజకీయ పార్టీల లక్ష్యం కాదు. దేశ లక్ష్యం. 2047 నాటికి లక్ష్యాలను సాధించడమే.. టార్గెట్గా పెట్టుకున్నారు. నివేదికలు కూడా అవే చెబుతున్నాయి.