వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు ఆ పార్టీలో అలజడి రేపుతున్నారు. మరో రఘురామకృష్ణరాజులా మారుతున్నారు. గతంలో తెలుగు మీడియం గురించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పరోక్షంగా రఘురామకృష్ణరాజు పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత .. ఆయన పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు ప్రభుత్వ డేటాచోరీ అంశంపై పార్లమెంట్లో నేరుగా మాట్లాడి వైసీపీలో కలకలం రేపారు.
ఓట్ల రాజకీయాలకు డేటా ప్రభుత్ం దుర్వినియోగం చేస్తోందని లావు ఆరోపణ
వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ లావు కు మాట్లాడే అవకాశం వచ్చింది. ప్రభుత్వం సేకరిస్తున్న వ్యక్తిగత వివరాలు పథకాల అమలు కోసం వినియోగించుకోవచ్చని బిల్లులో ఉందని.. కానీ ప్రభుత్వాలు వాటిని దుర్వినియోగం చేసి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉపయోగించుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం.. డేటా చదుర్వినియోగం అనే మాట వినిపిస్తే.. అందరూ చూసేది వైసీపీ ప్రభుత్వం వైపే. ఆ విషయంపై స్పష్టత ఉన్నా… లావు కృష్ణదేవరాయులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా ఏపీ ప్రభుత్వం అని ఆయన చెప్పలేదు కానీ.. సులువుగానే అర్థమైపోతుంది.
వాలంటీర్ల వివాదం ఉన్నప్పుడు లావు అలా ఎలా మాట్లాడారు ?
వాలంటీర్ల తో సమాచారం సేకరించి.. ప్రభుత్వం ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు విస్తృతంగా వస్తున్నాయి. ఓ ప్రైవేటు కంపెనీకి సమాచారాన్ని షేర్ చేస్తున్నారని.. వారి ద్వారా ఓటర్లను 360 డిగ్రీల ప్రోపైలింగ్ తయారు చేసి ఓటర్లను ప్రభావితం చేసే కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఎంపీ లావు… నేరుగా పార్లమెంట్‌లోనే మాట్లాడారు. ఇప్పుడు ఆయనపై వైసీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఆయన వైసీపీ అధినేత తీరుతో అసంతృప్తి చెంది పార్టీకి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.
ఈ సారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారా ?
ఎంపీ లావు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని.. టీడీపీ అధినేత చంద్రబాబుతో రహస్యంగా భేటీ అయ్యారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. రసారావుపేట పార్లమెంట్ పరిధిలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో గొడవలు ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. గతేడాది టీడీపీ ఎంపీలతో కలిసి ఫొటోలు దిగడం పెద్ద చర్చకే దారితీసింది. ఈ వార్తల తాజాగా లోకేష్‌కు ఎంపీ లావు వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది.