ప్రజాయుద్ధ నౌకగా పేరు తెచ్చుకున్న గద్దర్ చనిపోయారు. నిస్సందేహంగా ఆయన తన సిద్ధాంతాల్ని గట్టిగా ప్రచారం చేశారు. అది ఆయన భావజాలం. ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం అధికార లాంఛనలతో పోలీసులతో సెల్యూట్ కొట్టించి మరీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం వివాదాస్పదం అవుతోంది. మావోయిస్టుల సానుభూతిపరుడు అయిన గద్దర్.. ఎంతో మంది పోలీసుల్ని మావోయిస్టులు హత్య చేసినప్పుడు కనీసం తప్పు అని చెప్పలేదని కొంత మంది గుర్తు చేస్తున్నారు.
తుపాకీ గొట్టంతో రాజ్యం సాధించాలనుకున్న గద్దర్
గద్దర్‌ది విప్లవ నేపధ్యం. ఆయన ఆ పంధా ఎంచుకున్నారు. ఆయన ప్రజా నాట్యమండలి వంటి సంస్థ స్థాపకుల్లో ఒకరు. ఆయన భావజాలం అది. ప్రజాస్వామ్యం.. ఓటు అనేది వృధా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధించాలని మావోయిస్టులతో కలిసి పని చేశారు. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులకు … బయట ఉండి సహకారం అందించేవారిలో గద్దర్ ముఖ్యులన్న ప్రచారం ఉంది. అది బహిరంగ రహస్యం. పోలీసు శాఖలో ఉన్న వారందరికీ తెలుసు.
పోలీసులను మావోయిస్టులు చంపడాన్ని గతంలో సమర్థించిన గద్దర్
గతంలో మావోయిస్టులు విధ్వంస కాండ సృష్టించేవారు. పోలీసుల్ని వర్గ శత్రువుగా ప్రకటించుకుని చంపేస్తూ ఉండేవారు. అయితే గద్దర్ ఎప్పుడూ ఈ హింసను ఖండించలేదు. అదే సమయంలో రాజకీయ నేతల్ని హత్యలు చేసినా ఆయన సానుభూతి చూపించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో పోలీసులు … ఎదురు కాల్పుల్లో మావోయిస్టుల్ని ఎన్ కౌంటర్ చేస్తే మాత్రం ఆయన ఆందోళనలకు దిగేవారు. పోలీసులపై తీవ్ర విమర్శలు చేసేవారు. మావోయిస్టులు పూర్తిగా బలహీనపడటం..తనకు వయసు అయిపోవడంతో గద్దర్ మనసు మార్చుకున్నారు. ఇటీవల ఆయన అన్ని పార్టీలతో కలిసి ప్రజాస్వామ్యం అంటున్నారు.
తెలంగాణ పోలీసుల్లో అసంతృప్తి – కేసీఆర్ దిద్దుబాటు చర్యలు
గద్దర్ రాజకీయ నేతలకు…. ఆయన భావాలున్న వారికి గొప్ప కావొచ్చు కానీ.. పోలీసులకు మాత్రం ఏ విధంగానూ ఆయన హితుడుకాదని స్పష్టం చేస్తున్నారు. ఎంతో మంది పోలీసు కుటుంబాల వేదనకు కారణమైన వారిలో గద్దర్ కూడా ఒకరని అంటున్నారు. అందుకే ఆయనకు ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయించడం కరెక్ట్ కాదని.. ముఖ్యంగా పోలీసులతో సెల్యూట్ చేయించడం కరెక్ట్ కాదంటున్నారు. పోలీసుల్లో అసంతృప్తిని గుర్తించిన ప్రభుత్వం … తప్పు దిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. సజ్జనార్ లాంటి అధికారులతో ప్రకటనలు ఇప్పిస్తోది. పోలీసులను అగౌరవ పరిచినట్టు కాదని.. తెలంగాణ ప్రజల సమస్యలను తన గానం రూపంలో చాటి చెప్పాడని.. ఓ గౌరవప్రదమైన వ్యక్తికి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయడం లో తప్పు లేదు.. తాను సమర్థిస్తున్నానని చెప్పుకొచ్చారు.