దేశానికే కాదు.. తెలంగాణకూ నెహ్రూ చారిత్ర అన్యాయం – అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిన విషయాలు వైరల్ !

దేశ విభజనకు కారణం ఎవరు ? కశ్మీర్ ఇంత కాలం రగిలిపోవడానికి కారణం ఎవరు ? . ఇలా చెప్పుకుంటూ పోతే… దేశాన్ని ఏడు దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న సమస్యలకు కారణం ఎవరు అంటే… తొలి నాటి పాలకులే కారణం. అప్పటి ప్రధాన జవహర్ లాల్ నెహ్రూ.. భవిష్యత్‌లో దేశానికి గుదిబండల్లా మారుతాయని అనుకున్న సమస్యలన్నింటినీ పరిష్కరించకుండా.. అలా వదిలేశారు. తాత్కలిక ప్రయత్నాలతో అప్పటికి బయటపడ్డారు. కానీ అవి తర్వాత దేశానికి శాపంగా మారాయి. తెలంగాణకూ అతే తరహా అన్యాయం చేశారని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు.

స్కూల్ పాఠాల్లో చెప్పేది వేరు.. అసలు చరిత్ర వేరు !

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చాలా సేవ చేశామని స్కూల్ పాఠాల్లోనూ చెప్పుకుంటాం. పిల్లలకూ అదే నేర్పుతారు. కానీ కశ్మీర్ సమస్య సహా ప్రతిదీ నెహ్రూ పుణ్యమేనని చరిత్రకారులు చెబుతూంటారు. ఇప్పుడు కేసీఆర్ కూడా తెలంగాణ సమస్యకు నెహ్రూనే కారణమని అసెంబ్లీలో నినదించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు ? దీనికి ఎవరు బాధ్యులు ? అంటే జవహర్‌లాల్‌ నెహ్రూ అని కేసీఆర్ తేల్చి చెప్పారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు తెలంగాణ విద్యార్థులు, మేధావులు, ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారని కేసీఆర్ చెబుతున్నారు. ఆనాడు ఉన్న కొండా వెంకటరంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వ్యతిరేకించినా కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేశారన్నారు. ఇది చరిత్రలో రికార్డయ్యిందని.. . ఇక్కడి నుంచి విమానంలో వెళ్లే సమయంలో రామకృష్ణారావు తెలంగాణ తప్ప మరోమాట లేదని చెప్పారన్నారు. ఢిల్లీలో బలవంతంగా ఒప్పించిన తర్వాత.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో నెహ్రూ సాబ్‌ చెప్పిన తర్వాత ఏం మాట్లాడుతాం అన్నారని కేసీఆర్ చెప్పారు. ఇది కూడా చరిత్రలో ఉన్నది. ఇది కల్పిత కథ కాదని కూడా వివరించారు. ఆ విధంగా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్‌ అని తేల్చేశారు.

తెలంగాణపై తొలి నుంచి కాంగ్రెస్‌ది అణిచివేత ధరోణే !

తెలంగాణ విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ కొనసాగించిందని కేసీఆర్ చెబుతున్నారు. విడిగొట్టిన సందర్భంలో ఇచ్చిన హామీలు కాలరాస్తే ప్రేక్షకపాత్ర వహించిందే కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. చివరకు 1969 ఉద్యమంలోనూ కర్కషంగా వ్యవహరించిందన్నారు. తెలంగాణ ప్రజల్ని ఎంత రాచి రంపాన పెట్టారో.. ఎంత మందిని కాల్చి చంపారో.. ఆ ఘనత చరిత్ర అంతా కాంగ్రెస్‌లో పోతదిని తేల్చారు. 1969లో చెన్నారెడ్డి, విద్యార్థులు, ఉద్యోగుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే.. చివరకు తెలంగాణ డెమొక్రటిక్‌గా 14 ఎంపీ స్థానాల్లో 11 మందిని గెలిపించి.. యావత్‌ తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి అంటే.. ఆ నాడు ఇందిరాగాంధీ నో తెలంగాణ అని నిరాకరించారన్నారు. అంతిమంగా 41 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిందని తేల్చారు.

దేశం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో !

చరిత్ర అంటే… అప్పట్లో వారి వెర్షన్ వారు రాసుకున్నదే. స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా మందిని ద్రోహులుగా ఓ గ్రూప్ చిత్రీకరించింది. తమ గురించే గొప్పగా చెప్పుకున్నారు.. రాసుకున్నారు. దశాబ్దాలుగా పాఠ్యపుస్తుకాల్లో అదే చెబుతున్నారు. కానీ నిజంగా మరో కోణం కూడా ఉంది. అది కాంగ్రెస్… దేశాన్ని ఎలా క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టిందో తెలిపే కోణం. దాన్ని చాలా కాలంగా తొక్కి పెట్టారు. ఇప్పుడిప్పుడే విషయాలు బయటకు వస్తున్నాయి. అయినా తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత.