రామాయణంలో చెప్పే ఘట్టాలు, అవి జరిగిన ప్రదేశాలు భారతదేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. శ్రీరాముడి ముత్తాత రఘుమహారాజు పాలించిన రాజ్యం విశేషాల నుంచి పదితలల రావణాసురుడు శివుడి కోసం తపస్సు ఆచరించిన ప్రదేశం, రామ-రావణ యుద్ధం జరిగిన స్థలం వరకూ రామాయణం జరిగిందని చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యాలెన్నో. ఆయా ప్రదేశాలను ఇప్పుడు ఏమని పిలుస్తున్నారో తెలిపేందుకే ఈ కథనం…
ధర్మ బధ్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం ,మనిషి ఇలా బ్రతకాలంటూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మనిషి జన్మకున్న విశిష్ఠతను చాటి చెప్పిన పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అయోధ్య. ఇప్పుడు అక్కడే రామ మందిరం నిర్మాణం జరుగుతోంది.
@ కాంభోజ రాజ్యం – ఇరాన్ (శ్రీరాముడి ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి ఇరాన్ వరకూ విస్తరించి ఉండేది)
@ అయోధ్యనే సాకేతపురం అని పిలిచేవారు. సరయూ నది తీరంలో ఉన్న ఈ ప్రాంతమే శ్రీరాముని జన్మస్థలం, బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం.
@ దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం – ఫైజాబాద్, ఉత్తర్ ప్రదేశ్
@ రాముడు, లక్ష్మణుడిని తీసుకెళ్లిన తర్వాత విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలంకుశనాథపురం – సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
@ రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివుడిని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
@ పరమశివుని ఆత్మలింగాన్ని తీసుకెళుతూ మార్గమధ్యలో సంధ్యావందనానికి వెళ్లే సమయంలో పశువుల కాపరిగా వచ్చిన గణేషుడికి ఇచ్చి వెళతాడు రావణుడు. వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని నేలపైపెట్టిన స్థలమే కర్ణాటకలో ఉన్న గోకర్ణం…
@ సీతాదేవి పుట్టినిల్లు -జనక్ పూర్, నేపాల్
@ కోసలదేశం – రాజధాని అయిన అయోధ్య నుంచి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశాన్నే కోశలదేశం అనేవారు
@ అరణ్యవాసానికి వెళుతున్న సమయంలో గుహుడు సీతారామ లక్ష్మణులను కలిసిన చోటు – అలహాబాద్ దగ్గర ఉన్న శృంగబేరిపురం
@ అహల్య శాపవిమోచన స్థలం – అహిరౌలి, బీహార్
@ అరణ్యవాసం చేసిన దండకారణ్యం – చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లలోని కొన్ని ప్రాంతాలను కలపి దండకారణ్యం అంటారు
@ చిత్రకూటం (సీతారామ లక్ష్మణులు వనవాసం చేసిన చోటు) – మధ్యప్రదేశ్ లో ఉన్న సాత్న జిల్లా
@ కబంధాశ్రమం – కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక
@ శబరి ఆశ్రమం – సర్బన్, బెల్గావి, కర్ణాటక
@ హనుమంతుడు రామ లక్ష్మణులను మొదటిసారిగా కలసిన ప్రదేశం – హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక
@ ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం హంపి దగ్గరున్ కర్ణాటక.
@ తాటక వధ జరిగిన ప్రదేశం – బక్సర్, బీహార్
@ విభీషణుడు రాముణ్ణి శరణు కోరిన స్థలం – ధనుష్కోటి, తమిళనాడు
@ శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం, తమిళనాడు
@ రత్నద్వీపం / సింహళం / లంక – శ్రీలంక
@ అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) – కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
@ శ్రీరాముడు రావణుడిని వధించిన చోటు – దునువిల్ల, శ్రీలంక
@ సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం – దివిరుంపోల, శ్రీలంక
@ వాల్మీకి ఆశ్రమం/ కుశ లవుల జన్మ స్థలం / సీతాదేవి భూదేవిలో ఐక్యమైన స్థలం – ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్
@ కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) – కుశార్, పాకిస్తాన్
@ లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) – లాహోర్, పాకిస్తాన్
@ తక్షశిల (శ్రీరాముని తమ్ముడు భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) – తక్షశిల, పాకిస్తాన్
@ పుష్కలావతి/ పురుష పురం (భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) – పెషావర్, పాకిస్తాన్