భారీ సినిమా అయినా చిన్న సినిమా అయినా ప్రారంభం కాగానే తెరపై ఫస్ట్ కనిపిస్తుంది ఈ చిన్నారి. థియేటర్లకు వెళ్లేవాళ్లంతా ఈ పాపని ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇప్పటికే పలు మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ లో నటించింది. హీరోయిన్ గా మారే అవకాశం కోసం ఎదురుచూస్తోంది.
థియేటర్లో లైట్స్ ఆఫ్ కాగానే..‘ఈ నగరానికి ఏమైంది ఓ వైపు పొగ మరోవైపు నుసి ఎవ్వరూ నోరుమెదపరేంటి అంటూ ఓ ప్రకటన కనిపిస్తుంది. సినిమా ప్రారంభానికి ముందోసారి ఇంటర్వెల్ సమయంలో మరోసారి వచ్చే ఈ యాడ్ అందరికీ గుర్తే. తండ్రి సిగరెట్ తాగుతుంటే పక్కనే కూర్చున్న ఓ చిన్నారి అమాయికంగా చూస్తుంటుంది. అప్పుడు తన చేతిలో ఉన్న సిగరెట్ విసిరేస్తాడు. అంటే పొగతాగేవారికి మాత్రమే కాదు పీల్చే వారికి కూడా అత్యం ప్రమాదకరం అని చెప్పడమే ఈ ప్రకటన ఉద్దేశం. ఈ యాడ్ చూసి ఎంతమంది మారారో తెలియదు కానీ బూరెబుగ్గల చిన్నారి మాత్రం పాపులర్ అయిపోయింది. ఆ చిన్నారి ఇప్పుడు పెద్దైపోయింది. పేరు సిమ్రాన్ నటేకర్.
1997లో ముంబైలో జన్మించిన సిమ్రాన్ నటేకర్ ఈ నగరానికి ఏమైంది యాడ్ తర్వాత సుమారు 150కి పైగా ప్రకటనలలో మెప్పించింది. బుల్లితెరపై అప్పట్లో సూపర్ హిట్ సీరియల్ ‘చిన్నారి పెళ్లికూతురు’లో పూజ అనే పాత్రతో అందరినీ మెప్పించింది. ‘క్రిష్ 3’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేసింది. 2010లో రితీష్ దేశ్ ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ కలిసి నటించిన ‘జానే కహాన్ సే ఆయీ హై’ మూవీలో కనిపించింది. అయితే ఇప్పటివరకూ వెండితెరపై తనని తాను ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ రాలేదు. మంచి అవకాశాలకోసం తెలుగు ఇండస్ట్రీపై కన్నేసిందట. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లతో పలు ఆడిషన్స్ కూడా ప్లాన్ చేసుకుందట. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సిమ్రాన్ నటేకర్ ఎప్పటికప్పుడు బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ మరింత చేరువవుతోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడుగుతోంది. పొగతాగొద్దంటూ హెచ్చరించిన చిన్నారికి హీరోయిన్ గా ఛాన్సిచ్చేదెవరో వెయిట్ అండ్ సీ…