తెలంగాణ ఫర్ సేల్ – కేసీఆర్ అమ్ముతున్నది ఎవరి భూములు ?

కోకాపేటలో తెలంగాణ సర్కార్ 43 ఎకరాల భూములను వేలం వేసింది. 3300 కోట్లుకుపైగా ఆదాయం వచ్చింది. ఇలా వేలం వేయడం ఇదే మొదటి సారి కాదు. రెండేళ్ల నుంచి వేలం వేస్తూనే ఉంది. వేల కోట్లు సంపాదిస్తూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం తమ ఆర్థిక అవసరాల కోసం ఇష్టారీతిన భూములను అమ్మకానికి పెట్టేస్తోంది. టోకున ఎకరాలను ప్లాట్లుగా చేసి విభజించేసి అమ్మేస్తోంది. హైదరాబాద్ శివార్లలో భూములను వేలం వేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకుంటోంది. జిల్లాల్లో కూడా భూములు వేలం వేయాలన్న ఆలోచన చేస్తోంది.

13వేల ఎకరాల అమ్మకానికి కేసీఆర్ సర్కార్ సన్నాహాలు

హైదరాబాద్ శివారు భూముల్ని అమ్మడం ద్వారా వేల కోట్లను తెలంగాణ సర్కార్ సంపాదించుకుంటోంది. అయితే.. . ఆ ఒక్క చోట కూడా ఇతర చోట్ల కూడా భూములను వేలం వేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.
రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజ్​గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో దాదాపు 5 వేల ఎకరాల భూములు గుర్తించారు. ఇందులో డెవలప్​మెంట్​ కింద 2,500 ఎకరాలు పూర్తి చేసి దాదాపు రూ.10 వేల కోట్ల పైన ఆదాయం రాబట్టుకోవాలని చూస్తోంది. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలోని నాలుగు జిల్లాల్లో వెయ్యి ఎకరాల వరకు అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర భూములు ఉన్నాయి. వీటిని అమ్మి మరో రూ.5 వేల కోట్లు రాబట్టేందుకు ప్లాన్​ చేస్తోంది. ఇదంతా రెండు, మూడు నెలల్లో కంప్లీట్​ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. రాష్ట్రంలో అమ్మకానికి అనువైన 13 వేల ఎకరాల భూములను ఆఫీసర్లు గుర్తించారు

ఈ భూములన్నీ ప్రజా ఉపయోగం పేరుతో ప్రజల నుంచి సేకరించినవే.

ఎన్నికల్లోపు కేసీఆర్ నలభై వేల కోట్లు పథకాలకోసం ఖర్చు చేయనున్నారు. తెలంగాణ ప్రజల సంపదను అమ్మి వారికి పంచుతున్నారు కేసీఆర్. కానీ ఈ భూముల్ని ఇలా విచ్చలవిడిగా అమ్మేస్తే తర్వాత ప్రజావసరాలకు ఎక్కడ నుంచి భూమి వస్తుంది ? . ఇలా అమ్మడమే కాదు… కేసీఆర్ అస్మదీయులకు పెద్ద ఎత్తున భూములు కేటాయిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం ఏకంగా 11 ఎకరాలు కేటాయింపు చేసుకున్నారు. కుల సంఘాలకు ఐదేసి ఎకరాల చొప్పున ఇచ్చారు. చివరికి విశాఖ స్వరూపానందకు కూడా కోకాపేటలో రెండు ఎకరాలు కేటాయించారు. తర్వాత మళ్లీ ఏదైనా ప్రజావసరం కోసం భూములు అవసరం అయితే.. రైతుల వద్దే సేకరిస్తారు. ఇదంతా చూస్తే.. కేసీఆర్ ఎవరి సంపద ఎవరికి అమ్ముతున్నారు ? ఎవరికి పంచుతున్నారు.

ఓట్ల పథకాల కోసంప్రజల ఆస్తులు అమ్మేస్తారా ?

కేసీఆర్ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయి. ఏ ఒక్క దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు. కానీ కొత్త హమీల్ని అమలు చేశారు. దళిత బంధు, మైనార్టీ బంధు, బీసీ బంధు వంటి పథకాలు మేనిఫెస్టోలో లేవు . అయినా అమలు చేస్తున్నారు. ఓటింగ్ కు వెళ్లే ముందు సంతృప్తి స్థాయిలో ఓటర్లను .. సంతృప్తి పరిచేందుకు కేసీఆర్ చేస్తున్న నిధుల యజ్ఞానికి కోకాపేట భూములు సహకరిస్తున్నాయి. రైతుబంధు, దళితబంధు, గృహలక్ష్మి, బీసీలకు రూ.లక్ష ఆర్థిక చేయూతతో పాటు ఇప్పటికే రూ.వేల కోట్లు పెండింగ్‌‌లో ఉన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, స్కాలర్‌‌‌‌షిప్‌‌లు, కేసీఆర్ కిట్, పల్లెలకు, మున్సిపాలిటీలకు, మన ఊరు మన బడి వంటి వాటికి కూడా నిధులు విడుదల చేయలనుకుంటోంది. అప్పులు చేసి.. ఆస్తులమ్మ ఓటర్లకు పంచి మళ్లీ గెలవడమే నేటి రాజకీయం అన్నట్లుగా మారిపోయింది. పాపం .. తెలంగాణ ప్రజలు..!