ఇంట్లో అందరూ ఒకటే సోప్ వినియోగిస్తున్నారా!

నిత్యం స్నానం చేసేటప్పుడు సోప్ వినియోగించడం సర్వసాధారణం. అదే విధంగా ఇంట్లో బాత్ రూమ్ లో ఉన్న సోప్ ని అందరూ కామన్ గా వినియోగించడమూ కామనే. మరి ఒకటే సబ్బు అందరూ రుద్దేసుకోవచ్చా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

చ‌ర్మతత్వాన్ని బ‌ట్టి వివిధ ర‌కాల స‌బ్బుల‌ను ఉప‌యోగించి స్నానం చేస్తుంటారు. కొందరు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా వేరేవారి సోప్స్ వినియోగించరు కానీ ఇంకొందరు మాత్రం ఎక్కడికెళ్లినా అక్కడ అందరూ వినియోగించే సబ్బు రుద్దేసుకుంటారు. ముఖ్యంగా హాస్టల్స్, బ్యాచిలర్ రూమ్స్ లో ఆ అలవాటు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలా ఒకే స‌బ్బుతో ఇంట్లో అంద‌రూ స్నానం చేయ‌వ‌చ్చా, ఇత‌రుల ఉప‌యోగించిన సోప్ ను మనం వినియోగించవచ్చా, చేస్తే ఏమ‌వుతుందని అడిగితే అస్సలు వద్దంటున్నారు నిపుణులు.

సబ్బుపై 5 రకాల సూక్ష్మక్రిములు
ఒకే స‌బ్బుతో ఇంట్లో అంద‌రూ స్నానం చేయ‌కూడ‌ద‌ంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే స‌బ్బుపై 5 ర‌కాల సూక్ష్మ‌క్రిములు ఉండే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అలాగే ఈ క్రిములు ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపించే అవ‌కాశం ఉంది. స‌బ్బుపై ఇకోలి, సాల్మొనెల్లా, షిగెల్లా బ్యాక్టీరియా, నోరో వైర‌స్, స్టాఫ్, రోటా వైర‌స్ వంటి క్రిములు, వైర‌స్ లు ఉండే అవ‌కాశం ఉంది.అయితే సబ్బుపై క్రిములు ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాప్తి చెందుతాయి కానీ వ్యాధులు మాత్రం వ్యాప్తి చెందవు. ఇన్ఫెక్ష‌న్ మాత్రం వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా యాంటీ బ‌యాటిక్ రెసిస్టెంట్ స్టాఫ్ ఇన్ఫెక్ష‌న్ అయిన మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకాక‌స్ ఆరియ‌స్ అనే అంటువ్యాధి వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు. అందుకే ఒకరి సబ్బులు మరొకరు వినియోగించకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. సబ్బులు ఒకరివి మరొకరు వినియోగించరాదు కానీ లిక్విడ్స్ మాత్రం హ్యాపీగా వాడేయొచ్చు. అంటే బాడీ వాష్ లు, లిక్విడ్ సోప్ లు లాంటివి.

ఇంట్లో మనిషికో సోప్ కుదిరేపనేనా?
చెప్పేవాళ్లు వంద చెబుతారు కానీ ఇంట్లో ఉన్నవాళ్లంతా మనిషో సోప్ వినియోగించడం సాధ్యం అయ్యే పనేనా అంటే నిజంగా కుదరదనే చెప్పాలి. అలాంటప్పుడు స‌బ్బును వాడే ముందు శుభ్రంగా క‌డుక్కోవాలి. కొద్దిసేపు నురగ పోయేవరకూ కడగాలి. స‌బ్బు ఎల్ల‌ప్పుడూ పొడిగా ఉండేలా చేసుకోవాలి. స‌బ్బును తడిగా ఉంటే బ్యాక్టీరియా వృద్ది చెందే అవ‌కాశం ఉంది అందుకే స‌బ్బును ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. కుటుంబ సభ్యులవి పర్వాలేదు కానీ ఇతరులు వినియోగించిన సబ్బులు వాడకపోవడమే మంచిది. పైగా మీరు రుద్దుకున్న తర్వాత తడి ఆరేలా నీటిగా పెట్టాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.