శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మనిషి జీవితంలో సుఖ శాంతులతో ఉండాలంటే కచ్చితంగా నవగ్రహాల అనుకూలత ఉండాలి. గ్రహాలు అనుకూలించకపోయినా, వాటికి నచ్చని పనులు చేసినా ప్రతికూల ప్రభావం తప్పదని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అయితే గ్రహాలు అనుకూలంగా లేకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కానీ కొన్నిసార్లు గ్రహాలు అనుకూల స్థానంలో ఉన్నప్పటికీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటే అందుకు కారణం మీరు చేసే కొన్నిపనులే. ఎలాంటి పనులు చేస్తే ఏ గ్రహానికి ఆగ్రహం వస్తుంది, ఏం చేస్తే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుందో ఇక్కడ తెలుసుకోండి.
సూర్య
గ్రహాలకు ఆద్యుడు ఆదిత్యుడు(సూర్యుడు). ప్రత్యక్షదైవంగా పూజలందుకుంటున్న సూర్యుడికి పితృదేవతలను ధూషిస్తే ఆగ్రహం వస్తుందట. అందుకే పితృదేవతలను నిందించడం, తల్లిదండ్రులపై కోపం వ్యక్తం చేసేవారిపై, సూర్యుడికి ఎదురుగా మలమూత్ర విసర్జన చేయరాదని చెబుతారు.
చంద్రుడు
అద్దంలో దిగంబరంగా చూసుకోవడం, ఇతరులను వెక్కిరించడం, కావాలని ఎదుటివారిని కించపరచడం చేస్తే చంద్రుడికి ఇష్టం ఉండదు.
బుధుడు
వ్యాపారాన్ని అశ్రద్ద చేసినా, గర్వంతో విర్రవీగినా, చేవిలో వేలు పెట్టినా…ముఖ్యంగా బుధవారం ఈ పనులు అస్సలు చేయకూడదు
బృహస్పతి
సర్వ శాస్త్రాలకు గురువైన బృహస్పతికి కోపం రాకుండా ఉండాలంటే విద్యను బోధించే గురువులను గౌరవించాలి. పొరపాటున కూడా గురువులను కించపరచకూడదు.
కుజ గ్రహం
అప్పు ఎగ్గొట్టినా, వ్యవసాయానికి సంబంధించిన మోసాలు చేసిననవారు కుజుడి ఆగ్రహానికి గురవుతారు.
శుక్ర గ్రహం
భార్యభర్తలు ఒకరిని మరొకరు అగౌరవపరుచుకుంటే శుక్రుడికి అస్సలు నచ్చటద. ఎందుకంటే లక్ష్మీదేవి కృపలేనిదే శుక్రుడి కరుణం ఉండదంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. నిత్యం గొడవపడేవారింట్లో లక్ష్మీదేవి ఉండదు.
కేతువు
ఇంట్లో పెద్దలు చనిపోయిన తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలు చేయకపోతే కేతువు ఆగ్రహానికి గురవకతప్పదు. తద్వారా పిశాచి పీడకు గురవుతారు.
రాహువు
వైద్య వృత్తి పేరుతో మోసం చేసినా, పాములకు హాని చేసిన రాహువుకి కోపం వస్తుంది. అందుకే వైద్యులు మీ వృత్తికి మీరు న్యాయం చేయకపోయినా పర్వాలేదు మోసం చేయకండి
శనీశ్వరుడు
మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోయినా, పెద్దవారికి గౌరవం ఇవ్వకపోయిన, తల్లిదండ్రులను చులకనగా చూసిన వారిపై శనిదేవుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడట. ఎవరికైన సేవ చేసినా, కష్టపడి పనిచేసినా శని చాలా సంతోషిస్తాడు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.