రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ మూవీకి సీక్వెల్ రానుందనే క్లారిటీ వచ్చేసింది. అయితే సీక్వెల్ దర్శకుడు మాత్రం రాజమౌళి కాదట…
స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను ఆధారంగా చేసుకుని విజువల్ వండర్ గా తెరకెక్కిన మూవీ RRR. సుమారు 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఫ్యాన్ ఇండియా స్థాయిలో వచ్చిన RRR గతేడాది మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకోవడం తోపాటు బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలబెట్టింది. ఈ మూవీకి సీక్వెల్ చేస్తున్నామని, అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఉంటారని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు సినీ రచయిత విజయేంద్రప్రసాద్. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనే విషయం క్లారిటీ లేదు కానీ హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది.
రాజమౌళి కాదు చంద్రశేఖర్ యేలేటి
RRR సినిమాకు దర్శకుడు రాజమౌళి కాబట్టి సీక్వెల్ కి కూడా జక్కన్నే దర్శకుడు అని అంతా ఫిక్సైపోయారు. కానీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే RRR సీక్వెల్ కి రాజమౌళి కాదు చంద్రశేఖర్ ఏలేటి అని టాక్. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న చంద్రశేఖర్ యేలేటి సీక్వెల్ బాధ్యతలు తీసుకుంటారట. ఐతే సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న చంద్రశేఖర్ యేలేటి అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం, సాహసం, మనమంతా, చెక్ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ కి దర్శకత్వం వహించాడు. RRR సీక్వెల్ కి దర్శకత్వ బాధ్యతలు అంటే చంద్రశేఖర్ యేలేటి అంగీరించినా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒప్పుకుంటారా అన్నది హాట్ టాపిక్. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ న్యూస్ ఎంతవరకూ నిజమో తెలియాలంటే వెయిట్ అండ్ సీ…
మహేష్ తో బిజిగా ఉన్న జక్కన్న
రాజమౌళి ప్రస్తుతం సూపర్ సార్ మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అడ్వెంచర్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ సుమారు రూ.600 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందనుంది. ఈ ప్రాజెక్టు కోసం రాజమౌళి హాలీవుడ్ మేకర్స్ తో చేతులు కలిపారు. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.