తెలంగాణలో ఇటీవలి కాలంలో ఎప్పుడూ రానంత వర్షం పడింది. వరదలు వచ్చాయి. హైదరాబాద్‌లో ఈ సారి వర్షం మాత్రమే పడింది. వరదలు రాలేదు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఆ చుట్టుపక్కన పడిన వర్షం దాటికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఈ వరదల ధాటికి గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. కడెం ప్రాజెక్టు గేట్లు తీయడానికి కూడా అధికారులకు చేత కాలేదు. ఇంత జరుగుతున్న సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారో మాత్రం ఎవరికీ తెలియదు.
వరద ముంపులో పలు జిల్లాలు
వరంగల్ సహా… ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వరద ముంపులో ఉన్నాయి. మోరంచపల్లి అనే గ్రామం అయితే పూర్తిగా నీట మునిగింది. ఎంత మంది చనిపోయారో లెక్కలు లేవు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు కొన్ని గ్రామాలప్రజల్ని కాపాడటానికి హెలికాప్టర్లు అవసరం అయ్యాయి. రాత్రి సమయంలో తిరిగే హెలికాఫ్టర్ అందుబాటులో లేదు. దీంతో అధికారులు చేతులెత్తేశారు. జనం చెట్ల మీద పుట్టల మీద ఆశ్రయం పొందాల్సి వచ్చింది.
కిషన్ రెడ్డి చొరవతో బయటపడిన పదుల మంది జనం !
తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసిటన్లుగా వ్యవహిరంచడంతో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. స్థానిక కలెక్టర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరదలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన కేంద్రం.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేసి.. వెంటనే రెండు హెలికాప్టర్లను, 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను హుటాహుటిన రంగంలోకి దించింది. 2 హెలికాప్టర్ల ద్వారా ఆ రెండు ఇండ్లపై చిక్కుకున్న గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు తరలించారు. రెండు ఆర్మీ హెలికాఫ్టర్లు పదుల సంఖ్యలోప్రాణాలను కాపాడాయి.
రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్
వరదల్ని ఏ మాత్రం పట్టించుకోని కేసీఆర్.. కడెం ప్రాజెక్టు కొట్టుకుపోతుందన్న ఆందోళన వచ్చినా లైట్ తీసుకున్నారు. హైదరాబాద్‌లో నామ మాత్రంగా పర్యటించిన కేటీఆర్.. అవసరం అయితే వరంగల్ కు పోతామని చెప్పుకొచ్చారు. కానీ అక్కడ పరిస్థితిని చూస్తే ఎవరైనా అక్కడకి వెళ్లి పనులు చేస్తారు. కానీ కేటీఆర్ కు ఇంకా అవసరం కనిపించలేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో రాజకీయ వ్యూహాలు ఆలోచిస్తున్నారని… అంటున్నారు. ఎన్నికలకు ఎజెండాను ఎలా ఖరారు చేయాలన్న ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు.