ఇది కలుపుమొక్క కాదు..ఎన్నో రోగాలు నయం చేసే ఔషధం!

మీరున్న ఇంటి చుట్టూ ఎన్నో మొక్కలుంటాయి.
మ‌న‌ చుట్టూ, మీరు వాకింగ్ కోసం వెళ్లే ప్రదేశం లేదా పార్క్ దగ్గర ఎన్నో మొక్కలుంటాయి. అవన్నీ కలుపు మొక్కలే అనుకుంటే పొరపాటే. అందులో వందల రోగాలను నివారించే ఔషధమొక్కలుంటాయి. ఏ మొక్కని ఎందుకు ఉపయోగిస్తారో సరిగ్గా తెలుసుకోవాలి అంతే. అలాంటి మొక్కల్లో ఒకటి చంచలాకు.

రోగాలు నయం చేసే చెంచలాకు
చెంచలాకు..దీనిని సంస్కృతంలో అర‌ణ్య‌, అర‌ణ్య‌ వ‌స్తుక అని అంటారు. ఈ మొక్క ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంటుంది. చాలామంది దీనిని కలుపు మొక్కగా భావించి పీకి పడేస్తారు. కొందరు మాత్రం వాటివల్ల ఉపయోగాలేంటే తెలియకపోయినా కానీ ఆ ఆకులతో కూర వండుకుని తింటారు. చెంచ‌లాకు మొక్క ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. భార‌తీయ సాంప్ర‌దాయ వైద్యంలో దీనిని ఔష‌ధంగా ఉపయోగిస్తున్నారు. ఎన్నో రోగాలు నయం చేసే శక్తి ఉన్న చెంచలాకు శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలను అందిస్తుంది. ఈ మొక్క‌లో కాల్షియం, ఐర‌న్, పొటాషియం, మెగ్నిషియం, ఫాస్ప‌ర‌స్ వంటి మిన‌ర‌ల్స్ ఎక్కువ‌గా ఉంటాయి. చెంచ‌లాకు మొక్క చ‌లువ చేసే గుణాన్ని క‌లిగి ఉంటుంది. దీనిని కూర‌గా వండుకుని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి త‌గ్గుతుంది, జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

కిడ్నీలో రాళ్లు కరిగించే చెంచలాకు
అన్నిటికన్నా ముఖ్యంగా కిడ్నీలో రాళ్లను కరిగించేస్తుంది చెంచలాకు. ఈ మొక్క ఆకుల క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల మూత్ర పిండాల‌లో రాళ్లు క‌రిగిపోతాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చెంచ‌లాకు మొక్క ఆకుల‌ను పేస్ట్ గా చేసి గాయాల‌పై, పుండ్ల‌పై ఉంచ‌డం వల్ల అవి త్వ‌ర‌గా మానిపోతాయి. ర‌క్త హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ కూర తింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకులతో చేసిన కషాయం తాగితే బాలింతలకు పాలు ఉత్పత్తి అవుతాయి. శ‌రీరంలోని ఎముక‌ల‌ను దృఢంగా ఉండేలా చేయ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో కూడా ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క ఆకులను ఉపయోగించి ఆస్తమా, తామర, ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్, రుతుక్రమం ఆగిన లక్షణాలు వంటి అనేక సమస్యలకు సొల్యూషన్ గా పనిచేస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం