వైసీపీ టిక్కెట్ల కోసం ఈ సారి రాజకీయ నేతలతో పాటు అధికారులు కూడా పోటీ పడుతున్నారు. పాదయాత్రలు కూడా ప్రారంభించేశారు. కొంత మంది వైసీపీ నాయకత్వం కూడా సపోర్ట్ చేస్తోంది. ఎక్కువగా రిజర్వుడు నియోజకవర్గాల్లోనే ఈ పోటీ ఎక్కువగా ఉంది.
రాజకీయ భవిష్యత్ కోరుకుంటున్న విధేయంగా పని చేసిన అధికారులు
సివిల్ సర్వీస్ అధికారులు ప్రభుత్వానికి ఏకపక్షంగా సహకరించారు. వీరు ఈ రిటైరైన వెంటనే వెంటనే వైసీపీలో చేరడమో లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆ పార్టీలో చేరి పోటీ చేయడమో చేయాలనుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఐదుగురు సివిల్ సర్వీస్ అధికారులు తమ రాజకీయ జీవితం వైసీపీతో ప్రారంభం అవుతుందని లెక్కలేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాలు కూడా ఎంపిక చేసుకున్నారు. వారి కోరికలను ఇప్పుడు వైసీపీ హైకమాండ్ కూడా కాదనలేని పరిస్థితి ఉందని అంటున్నారు.
అధికారుల భవిష్యత్‌కు భరోసా ఇచ్చిన వైసీపీ హైకమాండ్
ప్రభుత్వం మారితే వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అందుకే..తాము వైసీపీలో చేరుతామని టిక్కెట్లు ఇవ్వాలని కొంత మంది హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే ఓ సీనియర్ ఐపీఎస్ పై ఈ ప్రచారాలు బహిరంగంగానే వచ్చాయి. ఆయన కూడా రాజకీయ నాయకుడిలాగా ప్రకటనలుచేస్తూ ఉంటారు. తన జాతి అభివృద్ధే ముఖ్యమని.. రాజకీయాలు కాదని చెబుతూ ఉంటారు. మిగిలిన నలుగురూ.. తాము ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. అయితే వీరందరూ సిట్టింగ్‌లకే టెండర్ పెట్టబోతున్నారు. ఇంకా విశేషం ఏమిటంటే.. దాదాపుగా అందరూ రిజర్వుడు నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టారు.
పాదయాత్ర ప్రారంభిస్తున్న విజయ్ కుమార్
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఐఏఎస్ విజయ్ కుమార్ కు చాలా ప్రాధాన్యత లభిచింది. రిటైర్మెంట్ అయిన తర్వాత ఇలాంటి అధికారులకు ఏదో పదవి ఇచ్చినట్లుగా ఆయనకూ ఓ పదవి ఇచ్చారు. కానీ ఆయన లక్ష్యం అది కాదు ఎన్నికల్లో పోటీ చేయడం. ఇటీవల జిల్లాల్లో తిరిగి ఎస్సీ, ఎస్టీ వర్గాలతో సమావేశం అవుతున్నారు. జగన్ రెడ్డి సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఆ వర్గాల్లో వ్యక్తమవుతూండటంతో తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు. పాదయాత్ర చేస్తే జగన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన అనుకుంటున్నారు. ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున వైసీపీ టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు.