కేజీఎఫ్, కాంతార, చార్లీ777, విక్రాంత్ రోణ ఇలా కంటెంట్ కథలతో వచ్చి కోట్లు కొల్లగొడుతున్నాయి కన్నడ సినిమాలు. ఇప్పుడదే తరహాలో మరో సినిమా కన్నడనాట సంచలన సృష్టిస్తుంది. అదే హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే. రక్షిత్ శెట్టి సమర్పించిన ఈ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి తొలిసారిగా దర్శకత్వం వహించాడు.
హాస్టల్ పిల్లలు కోరుకుంటే..
చిన్న సినిమాగా విడుదలైన ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ యూత్ ని కట్టిపడేస్తూ భారీ కలెక్షన్లు సాధిస్తోంది. హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే అంటే తెలుగు లో హాస్టల్ పిల్లలు కోరుకుంటే అని అర్థం. నితిన్ కృష్ణమూర్తి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. హాస్టల్ లో ఉండే కుర్రాళ్ల మధ్య సాగే క్రైమ్ కామెడీ కథ ఇది. ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్‌లో కనిపించిన రిషబ్ శెట్టి తప్ప పేరున్న నటుడే లేడు. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఓ హాస్టల్ చుట్టూ తిరుగుతుంది. హాస్టల్ లోని ఒక రూమ్ లో అయిదుగురు ఉంటారు. వారిలో ఒకడికి షార్ట్ ఫిల్మ్ తీయాలని కోరిక. కానీ పరీక్షలు ఉండటం వల్ల మిగిలిన వారు అందుకు అంగీకరించరు. ఆ సమయంలోనే హాస్టల్ వార్డెన్ చనిపోతాడు. తన చావుకు ఆ అయిదుగురు కారణం అంటూ సూసైడ్ నోట్ రాస్తాడు. దాంతో షాక్ అయిన ఆ అయిదుగురు ఏం చేస్తారు.. అసలు ఆ వార్డెన్ ఎందుకు చనిపోయాడు. వీళ్లు కారణం అంటూ సూసైడ్ నోట్ ఎందుకు ఉంది అనేది స్క్రీన్ ప్లే ను చాలా సరదాగా నడిపించారు.
మరో కాంతారా అవుతుందా!
కన్నడ సినిమా పరిశ్రమలో మరో కాంతార అంటూ ఈ సినిమా గురించి పాన్ ఇండియా రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. ఓ వైపు ట్విస్ట్‌లతో షాకిస్తూనే.. మరోవైపు ఆ ట్విస్ట్‌లలో జెనరేట్ అయ్యే కామెడీతో కడుపుబ్బా నవ్వుకుంటారు. క్రైమ్ కామెడీని ఎంటర్టైనమెంట్స్ డోస్ పెంచారు. తొలిరోజు కోటీ షేర్ కూడా రాని ఈ సినిమా మౌత్ టాక్ పాజిటివ్ రావడంతో కలెక్షన్ల వరద పారుతుంది. ఐదో రోజు ఏకంగా కోటిన్నర షేర్‌ను సాధించి వీర లెవల్లో దూసుకుపోతుంది. రేపో మాపో ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేయడం మాత్రం ఖాయం అని ఫిక్సైపోయారు. దివ్య స్పందన, కాంతార హీరో రిషబ్ శెట్టి అతిథి పాత్రలో మెరిసి మెప్పించారు. ‘కాంతార’కు సంగీతమందించిన అజనీష్ లోక్‌నాథ్.. ఈ చిన్న సినిమాని తన మ్యూజిక్ తో మరో లెవల్‌కి తీసుకెళ్లాడు.