సర్పంచ్‌లకు మద్దతుగా ఏపీ బీజేపీ ఉద్యమం – కేంద్ర నిధులు దారి మళ్లించిన వైసీపీ సర్కార్ !

ఏపీ బీజేపీ సర్పంచ్‌లకు మద్దతుగా భారీ ఉద్యమమం చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవలి కాలంలో సర్పంచ్‌లో పార్టీలకు అతీతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం పంచాయతీలను ఆర్థికంగా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం… కేంద్రం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులను కూడా దారి మళ్లిస్తోంది. దీంతో సర్పంచ్‌లు గ్రామాల్లో చిన్న పని కూడా చేయలేకపోతున్నారు. బిల్లులు చెల్లించలేకపోతున్నారు. గ్రామ పంచాయతీలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని… ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ అండగా నిలబడాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు నిర్ణయించారు.

నిధులన్నీ బదలాయించుకున్న ప్రభుత్వం

రాష్ట్రంలో 13,369 గ్రామ పంచాయతీలున్నాయి. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీలకు రూ.7659 కోట్లు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం ఇచ్చింది. ఈ నిధులు పంచాయతీ ఖాతాల్లో జమ అయ్యాయి. కానీ ఏపీలోని ఒక్క సర్పంచ్ కూడా పైసా కూడా ఉపయోగించుకోలేదు. ఖాళీ అయిపోయాయి. పంచాయతీ తీర్మానం లేకుండా సర్పంచుల సంతకం లేకుండా నిధులు వెనక్కు తీసుకోవడం సరికాదు. ఎప్పుడు కేంద్రం నుంచి పంచాయతీలకు నిధులు వచ్చినా సర్పంచులకు తెలియకుండా విద్యుత్‌ ర్జీల కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది. దారి మళ్లించి సీఎఫ్‌ఎంఎస్‌ అకౌంట్లలో జీరో బ్యాలెన్స్‌ చూపించడం ప్రారంభించారు.

ఆందోళన చేస్తున్న సర్పంచ్‌లు

పంచాయ‌తీ ఖాతాల నుంచి నిధులు మళ్లించడం స్థానిక‌సంస్థ‌ల ప్ర‌తినిధుల‌ని ప్ర‌భుత్వం మోసం చేయ‌డం కింద‌కే వ‌స్తుందని అంటున్నారు. నిధులేమీ లేకపోవడం వల్ల అభివద్ధి పనులు చేపట్టాలేని పరిస్థితులలో పంచాయతీలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్నాయి. కనీసం పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు కూడా నిధులు లేవు. బ్లీచింగ్‌ పౌడర్‌ కొనుగోలు, చిన్న మోత్తాలలో చేపట్టే పనులకు కూడా సర్పంచులు ఆలోచన చేస్తున్నారు. సొంత నిధులతో చేయలేక పనులు చేస్తే బిల్లులు ఎప్పుడు వస్తాయి ఆలోచనలతో వెనకడుగు వేస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచిగా గెలిచిన తర్వాత ఎంతో కొంత నిధులు ఖర్చు చేసి పనులు చేపట్టారు. ఏమాత్రం నిధులు మంజూరు కాకపోవడంతో అభివద్ధి పనులకు వెనకడుగు వేస్తున్నారు.

సర్పంచ్‌లకు మద్దతుగా రంగంలోకి బీజేపీ

ప్రస్తుతం ఏపీలో అత్యధికంగా వైసీపీ సర్పంచ్‌లే ఉండటంతో చాలా మంది రోడ్ల మీదకు రాలేకపోతున్నారు. కొంత మంది వైసీపీ సర్పంచ్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఇతర పార్టీలు అండగా ఉండటం లేదు. అందుకే ఏపీ బీజేపీ వారికి మద్దతుగా పోరాడాలని నిర్ణయించుకుంది. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.