మనం సినిమాలాంటి ప్రయోగం బాలీవుడ్ లో చేయనున్నారా? రోషన్ ఫ్యామిలీ మూడు తరాలు నటించబోతున్నారా? ఇక్కడ ‘మనం’ ఎంత హిట్టైందో తెలుసు..అందుకే అదే ప్రయోగం బీటౌన్లో చేయాలని ఫిక్సయ్యారట రోషన్ కుటుంబం..
టాలీవుడ్ లో వచ్చిన ‘మనం’ సినిమా సూపర్ హిట్టైంది. అక్కినేని కుటుంబం నుంచి మూడు తరాలు కలసి నటించిన మూవీ ఇది. నాగేశ్వరరావు తండ్రిగా నాగార్జున, నాగార్జున తండ్రిగా నాగచైతన్య నటించారు. అయితే నేరుగా కాకుండా గడిచిన జన్మ ఈ జన్మలో గుర్తొచ్చేవిధంగా సినిమా సాగుతుంది. ఎక్కడా కన్ఫూజన్ లేకుండా బంధాల మధ్య భావోద్వేగాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు విక్రమ్ కుమార్. టాలీవుడ్ లో అప్పటివరకూ ఎవ్వరూ చేయని ప్రయత్నం చేసి హిట్టందుకుంది అక్కినేని ఫ్యామిలీ. మూడు తరాలు కలిసి నటించిన సినిమాని ప్రేక్షకులు హృదయాల్లో ఓ మధుర జ్ఞాపకంగా పదిలం చేసుకున్నారు. ఇప్పుడీ తరహా ప్రయత్నం రాకేష్ రోషన్ కుటుంబం చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు తరాల నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్న రోషన్ కుటుంబ వారసత్వం ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రాబోతుంది. ఈ విషయాన్ని హీరో హృతిక్ రోషన్ ఇన్ స్టా వేదికగా రివీల్ చేశాడు. గొప్ప సంగీత కళాకారుడైన తాత రోషన్ లాల్ నాగ్ రత్ 106వ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించాడు.
రాకేష్-రాజేష్-హృతిక్
హిందీ సినిమా రంగంలో రోషన్ లాల్ తో మొదలైన సినీ జీవితం తన కుమారులు రాకేష్ రోషన్..రాజేష్ రోషన్.మనవడు హృతిక్ రోషన్ కొనసాగిస్తున్నారు. ఈ మూడు తరాలకి సంబంధించిన కథనే డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. రాజేష్ రోషన్ కుమార్తె కూడా ఈ డాక్యుమెంటరీలో నటిస్తుంది. ఈ డాక్యుమెంటరీని డైరెక్ట్ చేసే బాధ్యత శషి రంజన్ కి అప్పగించారు. సొంత నిర్మాణ సంస్థలోనే రోషన్ కుటుంబ సభ్యులు దీన్ని నిర్మిస్తున్నారు. స్పష్టంగా చెప్పుకోవాలంటే ఇది బాలీవుడ్ లో మనం తరహా ప్రయత్నం అని తెలుస్తోంది. రోషల్ లాల్ బాల్యం నుంచి హృతిక్ రోషన్ స్టార్ హీరోగా ఎదిగేవరకూ ప్రతి విషయాన్ని పిన్ టూ పిన్ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇలా ఒకే తెరపై మూడు తరాలు కలిసి నటించాలంటే అదృష్టమే అని చెప్పాలి. టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ ..బాలీవుడ్ లో రోషన్ ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేసుకున్నారనే చెప్పాలి. మూడుతరాల కథను తెరకెక్కించేటప్పుడు ఎక్కడా క్లారిటీ మిస్సవకుండా చూసుకోవాలి. మనం సినిమా హిట్టైందంటే అదే కారణం. మరి రోషన్ ఫ్యామిలీ డాంక్యుమెంటరీ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.