వానాకాలంలో ఈ గ్రాస్ తో టీ పెట్టుకుని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు!

మొక్కలు పెంచే అలవాటు ఉండేవారింట్లో తప్పనిసరిగా లెమన్ గ్రాస్ కూడా ఉంటుంది. చిన్న కుండీలో ఉన్నా బాగా ఏపుగా పెరిగేస్తుంది. తెలుగులో చక్కగా చెప్పుకుంటే నిమ్మగడ్డి అంటారు. ఈ గ్రాస్ తో టీ పెట్టుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

నిమ్మగడ్డి..పేరులోనే కాదు ఈ గ్రాస్ కూడా అచ్చంగా నిమ్మకాయ వాసనే వస్తుంది. టీ పొడి, కాఫీ పొడి, పాలు ఇవేమీ అవసరం లేకుండా ఈ గడ్డిని కట్ చేసి నీళ్లలో వేస్తే చాలు టీ రెడీ. లెమన్ గ్రాస్ టీ నిత్యం తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
డయాబెటిస్‌ ఉన్నవారు నిత్యం ఈ టీని తాగితే షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. హైబీపీ ఉన్నవారు లెమన్‌ గ్రాస్‌ టీ నిత్యం తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. ఈ టీని రోజూ తాగడం వల్ల క్యాన్సర్‌ రాకుండా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది కూడా. ఇంకా జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలు, నిద్రలేమి, ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్లు, ఆందోళన, తలనొప్పి సమస్యలకు లెమన్‌ గ్రాస్‌ టీ అద్భుతంగా పనిచేస్తుంది. వీటితో పాటూ గొంతు సమస్యలు, దగ్గు, జలుబు, అలర్జీలు ఉన్నవారు ఈ టీని తాగితే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.

లెమన్‌ గ్రాస్‌ టీ ఇలా తయారుచేసుకోండి
ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. అందులో లెమన్ గ్రాస్ ఆకులు కట్ చేసి వేసి కొద్దిసేపు మరిగించాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి అవి గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టి అందులో తేనె కానీ బెల్లం కానీ వేసుకుని తాగేయాలి. తేనె, బెల్లం లేకుండా తాగొచ్చు. లెమన్‌గ్రాస్ టీని సిప్ చేయడం వల్ల చాలా రిలాక్స్ గా ఉంటుంది. లెమన్‌గ్రాస్‌ను వాసన చూడడం వల్ల ఆందోళన, ఒత్తిడి, నిరాశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లెమన్‌ గ్రాస్‌ టీ తాగడం వల్ల చర్మంలో మెరుపొస్తుంది.

చుండ్రు తగ్గిస్తుంది
లెమన్ గ్రాస్ రసంతో చుండ్రును సులభంగా వదిలించుకోవచ్చు. ఎందుకంటే లెమన్ గ్రాస్ రసం యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. అందుకే దీనిని వివిధ నూనెలు, షాంపూలలో ఉపయోగిస్తారు. కేవలం రెండు-మూడు ఆకులను నీటిలో ఉడకబెట్టి.. చల్లారిన తర్వాత మీ జుట్టును శుభ్రం చేసుకోవచ్చు. లేదంటే లెమన్ గ్రాస్ తో తయారైనా ఆయిల్స్ తెచ్చుకుని వినియోగించినా ప్రయోజనం ఉంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం