వాలంటీర్ వ్యవస్థతో యువత నిర్వీర్యం – ఇది స్వార్థం కాదా ?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. డిగ్రీ ఆపైన చదువుకున్న లక్షల మంది ఐదు వేల రూపాయలతో పని చేస్తున్నారు. వారు డేటా చోరీకి పాల్పుడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని మాజీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ఆరోపించారు. వ్యవస్థను రద్దు చేయాలని అన్నారు. ఆయన చెప్పిన మాటల్లో వంద శాతం నిజం ఉందన్న అభిప్రాయం వినిపిస్ోతంది. వాలంటీర్లకు ప్రభుత్వ పరమైన ప్రాధాన్యత లభిస్తూండటంతో వారంతా ఇతర లక్ష్యాల్ని వదిలేసి.. పూర్తిగా దానికే పరిమితమవుతున్నారు. దీంతో లక్షలమంది యువతీ యువకుల భవిష్యత్తుని జగన్ ప్రభుత్వం ఎదుగుదలలేకుండా కుదించేసింది. ఇది యువత భవిష్యత్‌ను… నాశనం చేయడమే.

లక్షల మంది వాలంటీర్లుగా సరిపెట్టుకుంటే యువ శక్తి ఏం కావాలి ?

నేటి యువతే రేపటి దేశభవిష్యత్‌కు పునాదులు. వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఉద్యోగాలు ఉపాధికల్పనా ప్రభుత్వ బాధ్యత. వనరులు అవకాశాలు, అవసరాలను మదింపు చేసి ఐదు, పదేళ్ళ వ్యవధికి ఉపాధి అవకాశాలను నిర్ధారణ చెయ్యాలి. ఆ మేరకు ఉద్యోగాలు ఇవ్వాలి. కనీసం ఎదురుగా వున్నఅవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ రంగాలు ప్రపంచ మంతా విస్తరిస్తున్న సమయంలో చురుగ్గా ఓపిగ్గాసూక్ష్మంగా పనిచేయగల సామర్థ్యం వున్న భారతీయులకు మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇలాంటిపోటీ ప్రపంచంలో యువతను ఎలా తయారు చేయాలి..? ఎలా తయారు చేస్తున్నారు ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.

వైసీపీ స్వార్థం కోసం వారిని బలి చేస్తారా ?

1996 లో ఐటి సాఫ్ట్ వేర్ రంగాల భవిష్యత్తుని పసిగట్టిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రంగాల్లోవిద్యావకాశాలు సృష్టించారు. 600 ఇంజనీరింగ్ కాలేజిలు నెలకొల్పేలా చూశారు. ఈ అవకాశాలను చంద్రబాబుసద్వినియోగం చేసుకుని రూపొందించిన ప్రణాళికల వల్ల దాదాపు 20 ఏళ్ళపాటు తెలుగు టెకీలకు ఒకట్రెండ్ గా ఉద్యోగాలు వచ్చాయి. ఇదంతా చంద్రబాబు వల్ల మాత్రమే జరిగిందని చెప్పలేం కానీ.. ఆయన పరిస్ధితిని అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకోగలిగారని చెప్పవచ్చు. పాలకుడు చేయాల్సింది కూడా అదే.

యువతను నిర్వీర్యం చేసి ఏం సాధిస్తారు ?

వాలంటీర్ల ని నియమించడంతో జగన్ రాజకీయ అవసరాలే తప్ప విజన్ ఏమీ లేదు. సరళీకృత ఆర్ధికవిధానాల వల్ల ఎన్నెన్నో అవకాశాలు వస్తాయి. వాటిని అందుకోవడానికి అవసరమైన ఇన్ ఫ్రాను, వాతావరణాన్ని ఏర్పరచడమే ప్రభుత్వాల బాధ్యత! ఆ బాధ్యతను అంటే ఆహారాన్ని సంపాదించే దారినిచంద్రబాబు చూపించారు. కానీ వాలంటీర్లతో వాలంటీర్ల తో జవాబుదారీతనం లేకుండా, ఇప్పటికే ఉన్న సిస్టమ్ కు సమాంతరంగాపనిచేసే ఏ వ్యవస్ధ అయినా ఊహించని సమస్యలకు, ప్రమాదాలకు దారితీస్తుంది . ఇప్పుడు అదే జరుగుతోంది.