వైసీపీని టెన్షన్ పెడుతున్న “లావు” – వైసీపీలో ఉండనివ్వరా ?

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో లుకలుకలు ఎక్కువ అవుతుననాయి. నర్సారావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు 2019 ఎన్నికలలో విజయం సాధించారు.. పార్టీ ఆరంభం నుంచి దేవరాయలు పార్టీతోనే ఉన్నారు..విజ్ఞాన్ విద్యాసంస్థలు అధిపతిగా ఉభయ తెలుగు రాష్ట్రంలకు పరిచయం…నర్సారావుపేట ఎంపీగా ఎన్నిక అయిన తర్వాత పార్టీలో లుక లుకలుకలతో ఇబ్బందులకు గురౌతున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఆయనను దూరం పెట్టింది.

ఎంపీగా ప్రోటోకాల్ కూడా దక్కడం లేదని లావు ఆవేదన

.చిలకలూరిపేట నియోజకవర్గం నర్సారావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రొటోకల్ మర్యాదలు కూడా దక్కటం లేదు. .ఆ నియోజవర్గ ఎంఎల్ఏ విడదల రజనీ కి ఎంపీకి మద్య గ్యాప్ అంతకతకు పెరుగుతుంది…తన పర్మీషన్ లేకుండా తన నియోజకవర్గంలోకి ఎంపీ ఎలావస్తారని అనేక సార్లు రోడ్డుఎక్కిన పరిస్థితులు ఉన్నాయి. లావు కృష్ణ దేవరాయలు ఊహించింది ఒకటి జరుగుతుంది మరొకటి. పీ కమ్మ సామాజిక వర్దానికి చెందిన వాడు కావడంతో తగిన ప్రాదాన్యత ఇవ్వడం లేదని భావిస్తున్నారు.. మెడికల్ కాలేజ్ పర్మిషన్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో టీడీపీ పార్టీలోకి వెళతారన్న వార్తలు లోకల్ గా హల్ చల్‌చేస్తున్నాయి..

గుంటూరు ఎంపీ సీటు ఆఫర్ చేశారా ?

లావు కృష్ణదేవరాయులు .ఇప్పటికే టీడీపీ అధిష్టానం టచ్ లో ఎంపీ ఉన్నారన్న వార్తలు ఊపందు కున్నాయి…గుంటూరు ఎంపీగా టీడీపీ పార్టీ నుంచి రెండవసారీ విజయం సాధించిన గల్లా జయదేవ్ సైలెంట్ అయ్మారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు…పార్టీకూడా జయదేవ్ స్థానంలో మరో అభ్యర్థి కోసం చూస్తోంది. ..గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కమ్మ కులానికి చెందిన వారైతే విజయం తద్యమని టీడీపీ పార్టీ భావిస్తుంది… కులం కూడా తోడవటంతో వైసీపీ నుంచి టీడీపీ లోకీ లావు దేవరాయలు జంప్ అవుతున్నారని..గుంటూరు ఎంపీ అభ్యర్ధి గా టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నరన్న టాక్ అయితే వినపడుతోంది…

పార్టీ మార్పుపై గుంభనంగా లావు !

విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్యకు చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే టిక్కెట్ గ్యారంటీ లేకపోవడతో ఆయన కుమారుడు వైసీపీలో చేరాడు. అక్కడ నుంచే ఎంపీగా గెలిచారు కానీ.. ఆ స్థాయిలో సంబంధాలను తర్వాత కొనసాగించలేకపోయారు. నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ నేతలతో వివాదాలుండటంతో… లావుకు పార్టీలో ఉక్కపోత ఎక్కువగానే ఉంది. అందుకే పార్టీ మార్పు ప్రచారం జరుగుతోంది.