కొత్త పద్దతిలో ఏపీ బీజేపీ సోషల్ మీడియా ప్రచారం – పాజిటివ్ పాలిటిక్స్‌కే ప్రాధాన్యం !

ఏపీ బీజేపీ ప్రచారంలో పాజిటివ్ పాలిటిక్స్ కే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది. సోషల్ మీడియా అంటే .. ఇతరులపై నిందలేయడానికే పార్టీలు సైన్యాలను నడుపుతూ ఉంటాయి. ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షురాలు పురందేశ్వరి సోషల్ మీడియా టీంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె కీలక సూచనలు చేశారు. కేంద్రం రాష్ట్రానికి ఎంతో చేసిందని.. దీన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఏం చేయాలన్నదానిపై సుదీర్ఘంగా చర్చించారు.

బూత్ స్థాయిలో వాట్సాప్ గ్రూపులు

బూత్ స్థాయి నుంచి వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి.. కేంద్ర ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సూచించారు. విజయవాడలో బీజేపీ సోషల్ మీడియా ప్రతినిధులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. . కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం ద్వారా ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు చేరువ కావడానికి అత్యంత శక్తివంతమైన సాధనం సోషల్ మీడియా అని.. జాతీయ స్థాయిలో ఎంత బలంగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారో ఆలాగే ఉపయోగించుకోవాలని పురందేశ్వరి దిశానిర్దేశం చేశారు.

కేంద్రంపై వ్యతిరేకప్రచారం తిప్పి కొట్టడం కీలకం.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న దుష్టప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు ప్రత్యేకమైన స్ట్రాటజీనలను అమలు చేయనున్నాు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పథకాల్ని వివరించి.. వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందనిసమావేశంలో నిర్మయించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సోషల్ మీడియా ఇంఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవలి కాలంలో బీజేపీ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఎక్కువగా ఉందో వివరించారు. బీజేపీ సోషల్ మీడియా విభాగం పనితీరు.. ప్రధాన పార్టీల స్థాయిలో ఉందని.. మరింతగా సోషల్ వారియర్స్ ను గుర్తించి… ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు.

ఆదివారం కీలక సమావేశం

ఏపీ బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని ఆదివారం నిర్వహిస్త్ున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పురదేంశ్వరి ఆఫీస్ బేరర్ల సమావేశానికి హాజరు కానున్నారు. కమిటీల బలోపేతం.. కమిటీల్లో మార్పులు చేర్పులపై ఈ సమావేశంలో చర్చే జరిగే అవకాశం ఉంది. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికే కమిటీ బాధ్యతలు అప్పగించాలంటూ ఇప్పటికే పురందేశ్వరి స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. పార్టీ అనుబంధ విభాగాలతోనూ ఆమె భేటీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ తనకు రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇవ్వడంతో.. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం కసరత్తులు మొదలుపెట్టారు.