సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా దర్శనానంతరం అక్కడున్న పూజారి తీర్థ ప్రసాదాలు అందిస్తారు. కానీ ఓ ఆలయంలో మాత్రం ఆ పరమేశ్వరుడే తీర్థం అందిస్తాడట.ఆ ఆలయం ఎక్కడుంది, విశిష్ఠత ఏంటో చూద్దాం..
పరమేశ్వరుడు ప్రసాదించే తీర్థం
కర్ణాటక లో బెంగళూరికి సమీపంలో కొలువైన శివగంగ క్షేత్రం సముద్ర మొత్తానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కొండ తూర్పు నుంచి చూస్తే పడుకున్న నందిలా కనిపిస్తుంది. పడమటి నుంచి చూస్తే కూర్చొన్న వినాయకుడిలా కనిపిస్తుంది. ఉత్తరం నుంచి చూస్తే పెద్ద పాములా, దక్షిణం వైపు నుంచి చూస్తే లింగాకారంలో కనిపిస్తుంది. సాక్షాత్తూ పరమేశ్వరుడే స్వయంగా తీర్థం ఉత్పన్నం చేసి అందిస్తాడని ప్రతీతి. అది కూడా ఏడాదికి ఒక్కరోజు మాత్రమే. ఆ రోజే మకర సంక్రాంతి. ఆలయం దగ్గర ఓ రాతి స్తంభం ఉంటుంది. దాని కింద రాతి తొట్టి ఉంటుంది. కేవలం మకర సంక్రాంతి రోజు ఉదయాన్నే ఇందులో నీరు ఉద్భవిస్తుంది. ఈ రహస్యం తెలుసుకోవడానికి ఎంతమంది ప్రయత్నించినా ఇప్పటికీ అంతుచిక్కలేదు. సంక్రాంతి రోజు కాకుండా మరెప్పుడు ఇక్కడ నీటి జాడ ఉండదు. మకర సంక్రాంతి ఉదయాన కొండమీద ఉద్భవించే నీటిని గంగోత్పత్తి కాలం అని పిలుస్తారు. అలా ఉద్భవించిన ఆ నీటికి ప్రత్యేక పూజ చేస్తారు. ఆ నీటిని ఏటా స్వర్ణ పాత్రలో పట్టి శివగంగ దేవాలయం నీటితో కలిపి, సగం పాత్ర నీరు మైసూర్ మహారాజు దర్బారుకు పంపుతారు. మిగిలిన తీర్థం అక్కడికి వచ్చిన భక్తులకు పంచుతారు. మకర సంక్రాంతి రోజు శబరిమలలో అయ్యప్ప జ్యోతి రూపంలో దర్శనమిస్తే ..శివగంగలో శివుడు తీర్థంఇచ్చి మహిమలు ప్రదర్శిస్తారుడు. కేవలం ఫైట్స్ లో వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటే కానీ ఈ రెండూ అద్భుతాలూ ఒకేసారి దర్శించుకునే భాగ్యం ఉండదు. ఎందుకంటే శివగంగలో ఉదయాన్నే గంగోత్పత్తి జరుగుతుంది..అదే రోజు సాయంత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఉంటుంది.
వానాకాలంలో ఎండుతుంది-ఎండాకాలంలో నిండుతుంది
ఆలయ సమీపంలో ఉండే మరో రాతి స్తంభంపై అఖండ జ్యోతి వెలిగిస్తారు. దానికి కొద్ది సమీపంలో కొండ బీటలో ఉండే ఊటబావిని పాతాళగంగ అని పిలుస్తారు. వింత ఏంటంటే వర్షాకాలంలో బాగా వర్షం కురిసే రోజులలో నీరు పొంగే బదులు అడుగంటి పోతుంది. ఎండా కాలంలో మాత్రం మట్టం కంటే పైకి నీరు ఉబుకుతుంది. ఇక్కడ శివుడి దేవేరి హున్నాదేవిగా పూజిస్తారు. అయితే ఈ కొండపై చేరుకోవడం చాలా కష్టతరమైన పని. ట్రిక్కింగ్ ని ఎంజాయ్ చేసేవారికి మాత్రం ఓ వరం.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.