బీజేపీ కొత్త అధ్యక్షురాలిపై ఓ వర్గం మీడియా కుట్ర – పార్టీలో వర్గాలు సృష్టిస్తారన్నట్లుగా ప్రచారం !

ఆంధ్రప్రదేశ్ బీజేపీ బలపడాలంటే ఎన్నో శక్తులను ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది . అందులో మొదటి వ్యతిరేక శక్తి మీడియానే. ఏపీ బీజేపీపై ఏదో ఓ ముద్ర వేసి.. ఫలానా పార్టీకి మద్దతు అన్నట్లుగా ప్రచారం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటాయి. ఇదే కుట్రల్ని ఇంత కాలం విజయవంతంగా అమలు చేశారు. ఇప్పుడు పురందేశ్వరిని నియమించడంతో … ఆమె పైనా అదే తరహా కుట్రలు ప్రారంభించారు. పార్టీలో వర్గాలకు ప్రాధాన్యం ఇస్తారని చెప్పడమే కాదు.. ఎవర్ని ప్రోత్సహించాలి.. ఎవర్ని పక్కన పెట్టాలన్న సలహాలు కూడా పరోక్షంగా ఇవ్వడం ప్రారంభించారు. ఈ కుట్రల్ని పురందేశ్వరి ఎలా చేధిస్తారన్నది బీజేపీ క్యాడర్ ఉత్కంఠగా చూస్తోంది.

వైసీపీ, టీడీపీలకు సమానదూరం !

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని ఇప్పటి వరకూ ఎవరు చేపట్టినా వారిపై మీడియా. . ఏదో ఓ పార్టీ ముద్ర వేసేది. ఇప్పుడు కూడా ఆమె సామజికవర్గం ఆధారంగా ఓ పార్టీ ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పురందేశ్వరి విలువల రాజకీయం చేస్తారు. అందుకే .. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేశారు. ఇరువురు ఒకే పార్టీలోఉండటం వల్ల బీజేపీకి మంచిది కాదన్న ఉద్దేశంతోనే ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నారు. అయినప్పటికీ పురందేశ్వరిపై ఓ పార్టీ ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీలో వర్గాలు సృష్టిస్తారన్నట్లుగా అపోహలు

ఇప్పటికే ఓ వర్గం మీడియా.. ఆమె బాధ్యతలు చేపట్టగానే. ..కీలక బాధ్యతల్లో ఉన్న .. ముఖ్యంగా గత అధ్యక్షుడు నియమించిన వారిని తొలగిస్తారని. . సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారన్న ప్రచారం చేస్తున్నారు. కాని నిజమేమిటంటే.. బీజేపీలో వర్గాలంటూ ఏమీ ఉండవు. ఎవరు పార్టీని నడిపిస్తారు.. అందరూ వారి వర్గమే. ఆ విషయం అందరికీ తెలుసు. ఇతర ప్రాంతీయ పార్టీల్లోలా నేతలు వర్గాలు సృష్టించుకుంటారు. జాతీయ పార్టీలో అది కుదరదు. అయినప్పటికీ.. ఆమెపై వర్గాల ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇతర పార్టీల మీడియాల ప్రభావం లేకుండా చూసుకోవాల్సి ఉంది !

మీడియా బీజేపీకి వ్యతిరేకంగా అంతర్గత సంక్షోభం సృష్టించేందుకు.. కొన్ని వర్గాల మీడియాలు చేసే ప్రచారం ఎక్కువగా ఉంటుంది. కొత్త అధ్యక్షురాలు.. ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మేలు కోరే మీడియా లేదు. కనీసం తటస్థంగా ఉండే మీడియా కూడా లేదు. బీజేపీని యిబ్బంది పెట్టాలని చూసే మీడియానే ఉంది. ఈ ప్రచారాలకు దూరంగా.. పార్టీకి కష్టపడేవారిని ఎంపిక చేసుకుని పురందేశ్వరి పార్టీని నడిపించాల్సి ఉంది. అప్పుడే ఆమెపై.. ఓ వర్గం బీజేపీ నేతలకే నేత కాకుండా ఉంటారు. మీడియా ట్రాప్ లో పడితే… ఆమె కూడా సొంత పార్టీలోనే కొంత మందికి వ్యతిరేకమవుతారు.