బీజేపీ వాయిస్ మీడియాలో వినిపించకూడదని కుట్ర – ఏపీబీజేపీపై ” రాజకీయ మీడియా” భారీ కుట్ర !

ఆంధ్రప్రదేశ్ బీజేపీపై .. రాజకీయపార్టీల కనుసన్నల్లో నడిచే మీడియా సంస్థలు చేసే కుట్రల అన్నీ ఇన్నీ కావు. ఏపీ బీజేపీ ఎవరు యాక్టివ్ గా పని చేస్తూంటే వారిపై తప్పుడు ప్రచారాలు చేస్తూంటాయి. వారికి పార్టీలో ప్రాధాన్యం దక్కకూడదని క్యారెక్టర్లపై నిందలేయడం … పేరు చెప్పకుండానే .. ఆ నేతే అనిపించేలా రకరకాల ప్రచారాలు చేయడం.. కామన్ అయిపోయింది. ఆ నేతలు పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నా.. తమకు నచ్చే పార్టీ కోసం … మెచ్చేలా ప్రకటనలు చేయలేదనో… లేకపోతే తాము సపోర్ట్ చేసే సామాజికవర్గం కాదనో వ్యతిరేకించడం … బీజేపీలో వారిపై అనుమానాలు పెంచేందుకు ప్రయత్నించే కుట్రలు చాలా కాలంగా సాగుతున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియామకం తర్వాత ఇది మరింతగా పెరిగింది.

నేతలు మీడియాతో మాట్లాడటమే తప్పన్నట్లుగా “రాజకీయ మీడియా” ప్రచారం

బీజేపీ విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేది మీడియా ద్వారానే. ఓ రాజకీయ నాయకుడు బలంగా తన వాయిస్ వినిపిస్తే బీజేపీకి ఎంత లాభం కలుగుతుందో…. రాజకీయాల్లో ఉన్న వారికి విడమర్చి చెప్పాల్సిన పని లేదు. ఇలా మీడియాలో బీజేపీ వాయిస్ ను గట్టిగా వినిపించే.. బీజేపీ నేతలపై … రాజకీయ మీడియా గురి పెట్టింది. వారు మీడియాలో మాత్రమే కనిపిస్తారని.. సొంత నియోజకవర్గాల్లో పట్టు ఉండని…. ఇలా కథనాలు వడ్డించడం ప్రారంభించారు. వారి ఉద్దేశం సుస్ఫష్టం. బీజేపీ వాయిస్ ను బలంగా వినిపిస్తున్న వారి నోరు నొక్కేయడం. పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేయడం. తద్వారా బీజేపీకి నష్టం చేయడం.. తమ మెచ్చే సామాజికవర్గ పార్టీకి మేలు చేయడం.

బీజేపీ వాయిస్ వినిపిస్తే … బీజేపీ విధానాలు ప్రజల్లోకి బలంగా వెళ్తే ఆ మీడియాకు ఎందుకు కోపం ?

ప్రస్తుత రాజకీయాల్లో ..మీడియా కూడా కులాలు, పార్టీ పరంగా విడిపోయింది. బీజేపీకి ఎలాంటి మీడియా సపోర్ట్ లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి మీడియా సపోర్ట్ లేని పార్టీ బీజేపీనే. పైగా బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయపార్టీల గుప్పిట్లో మీడియా ఉంది. వారు బీజేపీపై చేసే దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. వాటిని ఎదుర్కొనేందుకు ఏపీ బీజేపీలో ఉన్న ఇద్దరు, ముగ్గురు నాయకులే తమ వాదనా పటిమ వినిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారి నోరు కూడా మూస్తే.. ఇక బీజేపీ గురించి మాట్లాడేవారు ఉండరని ఈ మీడియాలు కుట్ర చే
స్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇది మొదటి నుంచి చేస్తున్న వ్యూహమే. ఇలంటి వ్యూహాల ధాటికి చాలా మంది బీజేపీ నేతలు .. పార్టీ కోసం కష్టపడి కూడా నిందలు మోయాల్సి వచ్చింది.

మీడియా ట్రాప్ లో బీజేపీ పడే రోజులు పోయాయి !

పురందేశ్వరి అధ్యక్షురాలిగా నియమించినప్పటి నుండి ఓవర్గం మీడియా… కొత్త కార్యవర్గం పేరుతో యువనేతలపై బురద చల్లే పనిలోనే ఉంది. మీడియాతోనే మాట్లాడతారంటూ… కొంత మంది నేతలపై తప్పుడు అభిప్రాయం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ తరపున మీడియాతో మాట్లాడటం అనేది ఓ గౌరవం. బీజేపీ విధానాల్ని మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం అనేదిప్రతీ నేతా చేయాల్సిన పని . ఇలాంటి ఆరోపణలు చేసి ఆ నేతల్ని నియంత్రించాలని మీడియా అనుకుంటే సాధ్యం కాదని.. పరిస్థితులు మారాయని బీజేపీ నేతలంటున్నారు. హైకమాండ్.. మరి రాజకీయ మీడియా కుట్రల ట్రాప్‌లో పడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.