వ్యాపారానుకూలతలో భారత్ టాప్ – జయ్ శంకర్ చెప్పిన వాస్తవం

మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అన్ని రంగాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. గతం వేరం….గత తొమ్మిదేళ్లు వేరని కూడా ప్రతీ పరిణామం చెప్పకనే చెబుతోంది.

కఠిన రూల్స్ కు చెల్లుచీటీ

విదేశాంగమంత్రి ఎస్. జయ్ శంకర్ ప్రస్తుతం ఇండొనేషియా పర్యటనలో ఉన్నారు. అక్కడ భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో వ్యాపారానుకూలత ఎలా పెరిగిందో వివరించారు. ఒకప్పుడు దేశంలో వ్యాపారం చేయాలన్నా, పరిశ్రమలు స్థాపించాలన్నా వందల కొద్ది రూల్స్ ని అధిగమించాల్సి వచ్చేదని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ రూల్స్ ను అటకెక్కించి వ్యాపారం చేయాలనుకునేవారికి వెసులుబాట్లు కల్పించారు. వ్యాపారానుకూలతో భారత్ 63 స్థానాలు ఎగబాకిందని జయ్ శంకర్ గుర్తుచేశారు. ప్రజల జీవితాలు మెరుగు పడ్డాయని, సగటు భారతీయుడు మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నాడని జయ్ శంకర్ చెప్పారు.

దేశంలో పెరిగిన వసతులు

దేశంలో 800 కోట్ల మందికి ఆహార భద్రత ఉంది. 45 కోట్ల మంది బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అవుతోంది. మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత 15 కోట్ల మందికి గృహ వసతి కల్పించారు. 45 కోట్ల మందికి కొత్త తాగు నీటి కనెక్షన్ ఇచ్చారు. 10 కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ అందింది. అంతకు మించి దేశంలో మౌలిక సదుపాయాల కల్పన వేగం పుంజుకుంది. రహదారుల నిర్మాణంలో దేశం నెంబర్ వన్ స్థానంలో ఉందని జయ్ శంకర్ గుర్తు చేశారు.

కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో ప్రపంచానికే ఆదర్శం

కరోనా నియంత్రణలో భారత్ అందరి కంటే ముందుంది. ప్రధానమంత్రి మోదీ స్వయంగా ల్యాబ్స్ కు వెళ్లి కొవిడ్ టీకా తయారీని పర్యవేక్షించారు. ఈ ఏడాది మార్చి నాటికి బూస్టర్ డోస్ తో కలిపి 220 కోట్ల కొవిడ్ టీకాలు వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. టీకాలకు అర్హత ఉన్న జనాభాలో 95 శాతం మందికి ఆ అవకాశం వచ్చింది. ముందుజాగ్రత్త చర్యగా కొన్ని వ్యాక్సిన్లకు ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొవిడ్ నాసికా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దాన్ని ఆమోదించింది. కరోనా పీక్ టైమ్ లో వ్యాక్సిన్ ప్రక్రియను సమర్థంగా నిర్వహించడం ద్వారా భారత్లో 45 లక్షల మరణాలను నిరోధించగలగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని జయ్ శంకర్ గుర్తుచేశారు

డిజిటల్ వ్యవస్థ ఇండియాలో వ్యాపించినంత వేగంగా ఎక్కడా విస్తరంచలేదు. డిజిటల్ పేపెంట్స్ ను ప్రోత్సహించడం ద్వారా జనానికి పూర్తి వెసులుబాటు కల్పించారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాస్ పోస్టు సేవలను సైతం మెరుగు పరచడం ద్వారా వెయిటింగ్ పీరియడ్ అతి తక్కువ ఉన్న దేశంగా గుర్తింపు పొందాం. మొత్తానికి మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి పరుగులు తీస్తోందని ఇండోనేషియాలోని భారతీయులు ప్రశంసిస్తున్నారు.