ప్రకాష్ జవదేకర్ – ఎన్నికల మాస్టర్ – తెలంగాణ బిజేపీ దశ తిరిగినట్లే !

తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ .. పార్టీ నేతలతో విస్తృతంగా మంతనాలు జరుపుతున్నారు. ఆయనకు గతంలో తెలంగాణ ఎన్నికల కోసం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు.. బీజేపీని బలోపేతం చేసే అంశంపై ఆయన పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండేలా.. పార్టీ క్యాడర్ ను ఆయన రెడీ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతల జాబితా, నియోజకవర్గాల వారీగా పార్టీ కీలక నేతలు అనుసరించాల్సిన స్ట్రాటజీలపై ఇప్పటికే కసరత్తు చేశారు.

ఎన్నికల టాస్కుల్లో జవదేకర్ కింగ్

గతంలోనూ జవదేకర్ తెలంగాణ బీజేపీ కోసం పని చేశారు. తెలంగాణ బీజేపీని గాడిన పెట్టేందుకు ఆ పార్టీ పెద్దలు విస్తృతంగా మంతనాల ుజరుపుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ లో రాష్ట్ర నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారిలో కొందరు నడ్డాను విడివిడిగా కలుసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణే అత్యంత ప్రధాన అంశం అని నడ్డా వారికి స్పష్టం చేశారు. ఇతర అంశాలు ఏవైనా సరే పక్కనపెట్టేయాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించడమే అందరి లక్ష్యం కావాలని కర్తవ్యబోధ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అంతర్గత వ్యవహారాలు మునుపెన్నడూ లేనంతగా చర్చకు దారితీశాయని, దీన్ని జాతీయ నాయకత్వం సహించబోదని నడ్డా ఘాటుగా హెచ్చరించారు. ఎన్నికల విషయంలో జవదేకర్ వ్యూహాలను అమలు చేయాలని అందరికీ సూచించారు.

వారానికో జాతీయ నేత తెలంగాణలో పర్యటన

పార్టీ జాతీయ స్థాయి పెద్దలు ఇకపై క్రమం తప్పకుండా తెలంగాణలో పర్యటిస్తుంటారని, రాష్ట్ర నేతలు కూడా క్రమశిక్షణతో మెలగాలని హితబోధ చేశారు. ఒకరిపై ఒకరు బురదచల్లే కార్యక్రమాలు కట్టిపెట్టాలని, పరస్పర ఆరోపణలు చేసుకుంటే చర్యలు కఠినంగా ఉంటాయని నడ్డా స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీకి.. బీఆర్ఎస్‌తో అవగాహన కుదిరిందని ప్రజల్లో ప్రచారం అవుతూండటం ఇబ్బందికరంగా మారింది. దీంతో బీఆర్ఎస్‌తో ఎలాంటి సంబంధం లేదని.. ఆ పార్టీని ఓడించేందుకే తాము ప్రయత్నిస్తున్నామని ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన రాజకీయ అవసరం ఏర్పడింది. ఈ కారణంగా మరింత ఉద్ధృతంగా బీఆర్ఎస్ సర్కార్‌పై పోరాటం చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

బీఆర్ఎస్ కుట్రల్ని తిప్పి కొట్టే అవకాశం

బీఆర్ఎస్ కుట్రల్ని తిప్పి కొట్టాలని బీజేపీ నేతలు గట్టిగా భావిస్తున్నారు. బీజేపీ తో సన్నిహితంగా ఉన్నట్లుగా .. కేసీఆర్ నటిస్తూండటమే అసలు సమస్య. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తు బీజేపీ డైరక్షన్ లో జరుగుతోందని… కవిత అరెస్టును ఆపారని ప్రచారం చేయడం కూడా అందులో భాగమే. వీటన్నింటినీ తిప్పి కొట్టాలని బీజేపీ నేతలు డిసైడయ్యారు.