గోదావరి జిల్లాల్లో మాత్రమే జనసేన వారాహి యాత్ర ఉంటుందా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. వారాహి వాహనాన్ని మళ్లీ బయటకు తీయాలనుకుంటున్నారు. ఏలూరులో తొమ్మిదో తేదీన బహిరంగసభ పెడుతున్నారు. ఇది రెండో విడత కాదు. కానీ..సభ పెడుతున్నారు. రెండో విడత రూట్ మ్యాప్ ను ఖరారు చేస్తున్నారు. ఎప్పటికి రెడీ అవుతుంతో కానీ.. ఇరవై రోజులకు కానీ .. తొమ్మిది నియోజకవర్గాలను మాత్రమే పూర్తి చేశారు. గోదావరి జిల్లాల్లోనే కంటిన్యూ చేస్తే.. మరో రెండు, మూడు నెలలు గోదావరి జిల్లాల్లోనే పవన్ ఉండాల్సి ఉంటుంది.

గోదావరి జిల్లాల్లోనే యాత్ర కొన సాగింపు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏలూరు సభ తర్వాత వారాహి యాత్ర రెండో విడతను ప్రారంభించబోతున్నారు. తొ ఇప్పటికి గోదావరి జిల్లాల్లోని 9 నియోజకవర్గాల్లో వారాహియాత్ర పూర్తయింది. మొత్తం 34 నియోజవకర్గాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గానికి రెండు రోజులు కేటాయించాలని పవన్ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అందుకే ముందుగా ఆ జిల్లాల్లో వారాహి యాత్రను పూర్తి చేయాలని అనుకుంటున్నారు. వారాహి యాత్రకు మధ్యలో ఇచ్చే విరామాలతో కలిసి మరో రెండు నెలల పాటు గోదావరి జిల్లాలోనే కొనసాగించే అవకాశం ఉంది. అంటే.. సెప్టెంబర్ ఆఖరు వరకూ గోదావరి జిల్లాల్లోనే ఉంటారు. మరి మిగిలిన జిల్లాల్లో ఎప్పుడు యాత్ర చేస్తారు.

ఆ రెండుజిల్లాల పార్టీగా ఉంటే చాలా ?

జనసేనకు అత్యధిక బలం ఉన్న జిల్లాలుగా ఆ రెండింటిని భావిస్తున్నారు. తన బలంపై దృష్టి పెట్టి వారి నమ్మకాన్ని పెంచుకోవాలన్న లక్ష్యంతో పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాత్ర ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ముందస్తు ఎన్నికల వార్తల్ని వైసీపీ కొట్టిపారేస్తున్నా… ఖచ్చితంగా తెలంగాణతో పాటే ఉంటాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. పవన్ పూర్తి మెజార్టీ తెచ్చుకుని సీఎం కావాల్సిన పని లేదని గోదావరి జిల్లాల్లో అత్యధిక సీట్లు తెచ్చుకుంటే… కింగ్ మేకర్ గా మారవచ్చని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే అక్కడే కాన్సన్ ట్రేట్ చేయాలని.. ఉత్తరాంధ్రలో కొన్ని స్థానాలను టార్గెట్ చేసుకుంటే చాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ముందస్తు లేకపోతే మళ్లీ షూటింగ్‌లు

పవన్ కల్యాణ్ ఎన్నికల వరకూ ప్రజల్లోనే ఉండనున్నారు. గోదావరి జిల్లాల్లోనే ఓ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతోనే పవన్ ఇంత యాక్టివ్ గా తిరుగుతున్నారు. కానీ వచ్చే మార్చి వరకూ ఎన్నికలు ఉండవన్న క్లారిటీ వస్తే మరో రెండు నెలలు ఆయన సినిమా షూటింగ్ లకు సమయం కేటాయించవచ్చని భావిస్తున్నారు.