రెడ్ వైన్ నేరుగా తాగాలా – ఏదైనా కలుపుకుని తాగాలా!

లెక్కలేనని మద్యం బ్రాండ్స్ లో రెడ్ వైన్ ఒకటి. ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుందని వైద్యులు కూడా సూచిస్తారు. అయితే మిగిలిన మందుల్లా రెడ్ వైన్ లో ఏదైనా మిక్స్ చేసి తాగాలా నేరుగా తాగాలా అనే సందిగ్ధం కొందరిలో ఉంటుంది…ఇంతకీ రెడ్ వైన్ ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది..

మనదేశంలో మందుబాబులకు కొదవే లేదు. ఏ టైమ్ లో చూసినా ఎంత ధర పెరిగినా మద్యం దుకాణాల ముందు మాత్రం కళ తగ్గదు. చివరకు కరోనా సమయంలో కూడా ఇంతకుమించి వ్యాక్సినేషన్ ఏముందన్నంతగా బారులు తీరారు. వైరస్ ను కూడా లైట్ తీసుకున్నారు. అయితే చాలామంది మందులో నీళ్లు, కూల్ డ్రింక్స్, షోడా కలుపుకుని తాగుతుంటారు చివకకుమనదేశంలో మద్యం సేవించే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఎక్కువ మంది నీరు, సోడా, కూల్ డ్రింక్స్ కలుపుకొని తాగుతుంటారు. మరి రెడ్ వైన్ లో ఏమైనా కలుపుకోవాలా వద్దా అన్న సందేహం కొందరిలో ఉంటుంది. రెడ్ వైన్‌ను హై క్లాస్ వైన్ అంటారు. సాధారణ మద్యం కంటే ఖరీదెక్కువ. అందుకే ఇది తాగే వారి సంఖ్య తక్కువే. పైగా ఎంత పాతదైతే ధర అంత ఎక్కువగా ఉంటుంది.

రెడ్ వైన్ లో ఏమీ కలపొద్దు
ఆల్కహాల్ తాగడమే ఆరోగ్యానికి హానికరం. మళ్లీ అందులో సోడా లాంటివి కలుపుకుని తాగడమంటే ఆరోగ్యానికి మరింత హాని చేయడమే అంటారు ఆరోగ్య నిపుణులు. సోడాలో కార్బన్ డయాక్సైడ్, ఫాస్పోరిక్ యాసిడ్ ఉంటాయి. ఇది శరీరంలోని కాల్షియంను నెమ్మది నెమ్మదిగా విచ్ఛిన్నం చేస్తుంది. ధ్వంసమైన కాల్షియం మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వస్తుంది. తర్వాత ఎముకలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. సోడాతో పోలిస్తే కూల్‌డ్రింక్స్‌లో షుగర్ లెవెల్స్ ఎక్కువ. కెఫిన్ పరిమాణం కూడా వీటిల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్, హ్యాంగోవర్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే రెడ్ వైన్ నేరుగా తాగొచ్చు కానీ అందులో ఏమీ మిక్స్ చేయకూడదు.

తగిన మోతాదులోనే తీసుకోవాలి
రెడ్ వైన్ పూర్తిస్థాయిలో ఆల్కహాల్ కాదు. కాకపోతే 12 నుంచి 15 శాతం వరకు ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. అయితే అధికంగా తాగితే మాత్రం అనారోగ్యం తప్పదు. తగిన మోతాదులో తీసుకుంటే దీని వల్ల కలిగే లాభాలు ఇన్నీ అన్నీ కావు. అధ్యయనాల ప్రకారం మహిళలలైతే రోజుకి 150 ఎమ్ఎల్ రెడ్ వైన్ తాగొచ్చు. మగవారైతే 300 ఎమ్ఎల్ అంటే రెండు గ్లాసుల రెడ్ వైన్ తాగవచ్చు. డయాబెటిక్ రోగులకు రెడ్‌వైన్ చాలా మేలు చేస్తుంది. వారి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రెడ్ వైన్ జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది, ఇన్ఫెక్షన్లను రాకుండా చేస్తుంది. రెడ్ వైన్ బరువును అదుపులో ఉంచేందుకు సహకరిస్తుంది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రెడ్ వైన్ తాగడం వల్ల ముఖ కండరాలు వదులవుతాయి. అంతేకాకుండా మంచి కలర్ వస్తారు. మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. అందుకే చాలా మంది దీనిని ప్రిఫర్ చేస్తారని చెబుతారు అయితే మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రయోజనాలుంటాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం