చైతూ-చందూ మూవీకి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్, ఈసారి హిట్టు పక్కా!

వరుస ఫ్లాపులతో ఉన్న నాగచైతన్య ఆశలన్నీ ఇప్పుడు చందూ మొండేటి సినిమాపైనే ఉన్నాయి. పైగా గతంలో ప్రేమమ్, సవ్యసాచి లాంటి కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన దర్శకుడు కావడంతో ఈసారి హ్యాట్రిక్ పక్కా అని ఫిక్సైపోయాడు చైతూ. రీసెంట్ గా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్లో మారుమోగింది. బంగార్రాజు సినిమాత కమర్షియల్ సక్సెస్ అందుకున్న అక్కినేని ఫ్యామిలీ ఆ తర్వాత హిట్టు మొహం చూడలేదు. అఖిల్ సంగతి అస్సలే చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

చైతూ-చందూ మూవీకి అనిరుథ్ సంగీతం
థ్యాంక్యూ, కస్టడీ సినిమాలతో నిరాశ పర్చిన చైతన్య చందుమొండేటితో సినిమా చేస్తున్నాడనగానే అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. చందూ గత చిత్రం కార్తికేయ 2 వంద కోట్లకు పైగా వసూళ్లు చేసింది, పాన్ ఇండియా రేంజ్లో మంచి పేరు, గుర్తింపు లభించింది.నార్త్ ఫిల్మ్ మేకర్స్ కూడా చందూ మొండేటితో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టాడు. కార్తికేయ 2 లాంటి భిన్నమైన కాన్సెప్ట్ ను ఇప్పటికే చైతూకోసం వండేశాడట. బడ్జెట్ కాస్త ఎక్కువైనా పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించేందుకు బన్నీవాసు రెడీగా ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించి తాజా క్రేజీ అప్ డేట్ ఏంటంటే ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుథ్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చనున్నాడట. టాలీవుడ్, కోలీవుడ్ లో సూపర్ స్టార్స్ సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు అనిరుథ్..నాగ చైతన్య – చందూ మొండేటి కాంబోకి ఉన్న క్రేజ్ ని చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.

మత్స్యకారుల కథ
శ్రీకాకుళం నుంచి గుజరాత్ కు వలస వెళ్లే మత్స్యకారుల కుటుంబాల ఇక్కట్ల బ్యాక్ డ్రాప్ లో ఈ కథ తెరకెక్కనుందని టాక్. ఇదే ఏడాది సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా సమాచారం. ఇంకా హీరోయిన్ తో పాటు ఇతర నటీనటులు ఎవరన్నది ఫైనల్ కావాలి.

సూర్య నుంచి చైతుకి మారిన కథ
డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమా కథని మొదట తమిళ హీరో సూర్యకి వినిపించారట. కథ నచ్చడంతో సూర్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. అయితే ప్రస్తుతం సూర్య ‘కంగువ’ సినిమా షూటింగ్ లో బిజీ అయిపోవడంతో ఈ మూవీపై పెద్దగా ఫోకస్ చేయలేదట. మరీ ఆలస్యం ఎందుకని ఆలోచించాడో ఏమో చందూ మొండేటి చైతన్యకి కథ వినిపించడం, ఓకే అనుకోవడం జరిగిపోయిందట.