టమాటా ఎవరు తినొచ్చు – ఎవరు తినకూడదు!

టమాటా లేకపోతే వంటసాగేదెలా అని ఆలోచిస్తున్నారా? రేటు మండిపోతోంది కొనేదెలా అసలు టమాటా లేనిదే వంట సాగేదెలా అని బాధపడిపోతున్నారా? మరీ అంతగా బాధపడిపోకండి. టేస్టీగా ఉండే టమాటాతో వచ్చే రోగాల లిస్టు కూడా పెద్దదే..

యవ్వనంగా ఉంచే టమాటా
రోజూ తినే కూరగాయల్లో టమాటా తప్పనిసరిగా ఉంటుంది. రసం నుంచి కూర వరకూ ఏం చేసినా టమాటా తప్పనిసరి. వంటలకు రుచిని ఇవ్వడమే కాదు యవ్వనంగా ఉంచేందుకు కూడా టమాటా ఉపయోగపడుతుంది. ఉదర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. టమాటాలో విటమిన్ ఎ, సి కంటెంట్ పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి, స్టార్చ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దాంతోపాటు.. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, క్రోమియం, కోలిన్, ఫోలేట్, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి.

టమాటాలు ఎవరు తినకూడదు
ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు టమాటా తినకూడదు. ఇంకా డయాలసిస్ రోగులు, కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులు టమాటా టచ్ చేయకూడదు. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు టమాటాలను తీసుకుంటే ఆరోగ్యానికి చేటు తప్పదు. ఎందుకంటే టమాటాలలో అధిక మొత్తంలో ఉండే ఆక్సలేట్ వల్ల ఈ భయంకర సమస్య వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అతిసారం
టమాటాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరోచనాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఉండేటువంటి సాల్మొనెల్ల బ్యాక్టీరియా డయేరియా సమస్యకు దారితీస్తుంది. అందుకే తక్కువ మోతాదులో తీసుకోవాలి

గ్యాస్ ప్రాబ్లం
టమాటాలను అతిగా తినడం వల్ల పొట్టలో గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బ తింటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ టమాటాలకు దూరంగా ఉంటే మంచిది..

మూత్రపిండాల్లో రాళ్లు
టమాటాలో ఆక్సలైట్ అధిక శాతం లో ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది.

కీళ్ల నొప్పులు
కీళ్ల నొప్పులు వయసును బట్టి కామన్ కానీ ఎక్కువగా టమాటాలు తింటే చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరీ ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో టమాటాలకు దూరంగా ఉండడమే మంచిది.

రోజుకి 2 టమాటాలు చాలు
టమాటాలు ఎక్కువగా తింటే తంటాలు తప్పవు. ఓ వ్యక్తి రోజుకి 300 నుంచి 400 గ్రాముల కూరగాయలు తినాలి. వాటిలో టమాటాలు 100 గ్రాముల వరకు తినవచ్చు. అంటే రెండు టమాటాలు చాలు. ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం మాట దేవుడెరుగు అనారోగ్యం తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం