అప్పుడే కలెక్షన్ మొదలెట్టిన కాంగ్రస్ ప్రభుత్వం

సీ కంటే కాంగ్రెస్, సీ అంటే కరప్షన్ అని ఒకప్పుడు అనేవారు. ఆ ఆరోపణ ఇప్పటికీ వర్తిస్తోంది. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దోచుకోవడం, దాచుకోవడం కాంగ్రెస్ నేతలకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే పీకల్లోతు అవినీతికి దిగడం మొదలైంది. అందినకాడికి దోచుకోవడం అలవాటు చేస్తున్న కాంగ్రెస్ మొదటి రోజు నుంచే కలెక్షన్ కు తెరతీసింది.

అవినీతి రంగంలోకి సీఎంఓ

చిన్న ఉద్యోగులు, అధికారులు అవినీతి చేస్తేనే కఠినంగా శిక్షించాల్సిన తరుణం ఇది. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నేరుగా బేరాలు మాట్లాడుతుండటం విశేషం. పోస్టింగులకు ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇస్తే వాటిని పట్టుకుని వచ్చే వారిని సీఎంఓ అధికారులు డబ్బులు అడుగుతున్నారట. లెటర్లు తెస్తే సరిపోదని ప్రతి పోస్టింగుకు ఒక రేటు ఉంటుందని చెబుతున్నారు. కనిష్టంగా రూ. 30 లక్షల రూపాయాలు లేనిదే పని కాదని బహిరంగంగానే అధికార వర్గాల్లో చెప్పుకుంటున్న మాట . ఉత్తి లెటర్లు వద్దని డబ్బులు పట్టుకు వస్తేనే సీఎంఓ వైపు చూడాలని మొహం మీదనే చెప్పేస్తున్నారట..

అవినీతి ఉందని అంగీకరించిన కుమారస్వామి

జేడీఎస్ నేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి కూడా కర్ణాటక ప్రభుత్వ అత్యున్నత కార్యాలయాల్లో అవినీతి ఉందని అంగీకరించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు పరిమిత స్థాయిలో అవినీతి ఉండేదని ఇప్పుడు అది విశృంఖలంగా వ్యాపించిందని ఆయన విశ్లేషించారు. అవినీతిని సమూలంగా కూకటి వేళ్లతో పెలికించి వేస్తామని చెప్పుకుని అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతీ పోస్టుకు ఒక రేటు ఫిక్స్ చేసిందని కుమారస్వామి ఆరోపించారు. పైగా అతి తక్కువ టైమ్ లో ఈ పనిచేయడం తమకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు.

నిన్న ఆరోపణలు చేసిన వారే…

నిన్నటి బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకుంది. అప్పటి బసవరాజ్ బొమ్మాయ్ ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడిందని ఆరోపించింది. ప్రతీ పనికి 40 శాతం కమిషన్ తీసీుకుంటున్నారని లెక్కలు చెప్పింది. నిజానికి 40 శాతం అనే మాట జనంలోకి బాగా వెళ్లింది. కాంగ్రెస్ గెలిచేందుకు అది బాగానే దోహదపడింది.అయితే కాంగ్రెస్ చేసిన ఒక్క ఆరోపణకు కూడా సాక్ష్యాలు చూపించలేకపోయింది. అవినీతి వ్యవహారంలో ఒక్క బీజేపీ నేత పేరు కూడా రాలేదు. ఐనా బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు మాత్రం సెక్రటేరియట్ లో లెగ్గు పెట్టగానే కాంగ్రెస్ నేతలు కలెక్షన్ ప్రారంభించారు. కాంగ్రెస్ అంటే అదే మరి..