ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో అద్భుత పథకాలను ప్రవేశపెట్టింది. వీటిలో ప్రధానంగా ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana). ఇప్పటికే ఈ పథకంలో చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు పెట్టుబడులు పెడుతున్నారు. ఇంతకీ ఎంత పెట్టుబడి పెడితే ఎంత స్తుందో తెలుసా…
ఈ స్కీమ్ లో ఎలా చేరాలి!
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ Sukanya Samriddhi Yojana పథకం కేవలం ఆడ పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా పదేళ్లలోపు వయసు ఉన్న వారు మాత్రమే పథకంలో చేరడానికి అర్హులు. ఇప్పటికే చేరిన వారు కాకుండా ఇంకా ఇందులో చేరని వారుంటే వెంటనే ఇందులో పెట్టుబడులు పెట్టండి. ఓ ఇంటి నుంచి ఇద్దరు అమ్మాయిలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ పథకంలో చేరాలని భావించేవారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మీకు దగ్గర్లో ఉన్న పోస్టాఫీస్ లేదా బ్యాంకుకు వెళితే సరిపోతుంది. అక్కడ సులభంగానే ప్రాసెస్ అయిపోతుంది. మీరు తీసుకెళ్లాల్సిన డాంక్యుమెంట్స్ ఇవే.
- బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ 2. పాన్ కార్డు 3. ఆధార్ కార్డు 4. మీ అమ్మాయి ఫోటోలు 5. పాప ఆధార్ కార్డు 6. పాప బర్త్ సర్టిఫికెట్
నెలకు ఎంత కట్టాలి – ఎన్నేళ్లు కట్టాలి
సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే నెలకు రూ.12,500 వరకు డిపాజిట్ చేయొచ్చు. వెయ్యి రూపాయల నుంచి 12,500 వరకూ ఎంత కట్టాలో మీ వీలు. కేవలం రూ.250తో సుకన్య అకౌంట్ తెరవొచ్చు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచిన తర్వాత 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్లాలి. తర్వాత డబ్బులు కట్టాల్సిన పని లేదు. అకౌంట్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత కొంత డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తి డబ్బులు పొందొచ్చు.
ఎంత కడితే ఎంత వస్తుంది!
సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) స్కీమ్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు కట్టొచ్చు. కనీసం ఎంత అనేది మీ ఇష్టం. నెలకు రూ.5 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీకి రూ.25 లక్షల వరకు వస్తాయి. నెలకు రూ.12,500 చొప్పున డిపాజిట్ చేస్తే.. 21 ఏళ్లకు అంటే మెచ్యూరిటీ సమయానికి చేతికి దాదాపు 64 లక్షల వరకు వస్తాయి. ఇంతే మొత్తం అని ఫిక్స్ కాదు ఎందుకంటే మూడు నెలలకోసారి వడ్డీరేట్లు సవరిస్తుంటుంది కేంద్రం. వాటికి అనుగణంగా వచ్చే అమౌంట్ కాస్త అటు ఇటుగా ఉంటుంది. మీరు ఎంత కట్టిన దానిపై డబుల్ అమౌంట్ యాడ్ అయి మీ చేతికి అందుతుంది. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత, అప్పటి వరకు పెట్టిన పెట్టుబడిలో సగం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది మీ కుమార్తె ఉన్నత చదువుల కోసం పనికొస్తుంది. పాపకు 21 ఏళ్లు పూర్తయిన తర్వాత, ఆ ఖాతాలో ఉన్న మొత్తం పెట్టుబడిని తీసేసుకోవచ్చు. ఇది ఉన్నత చదువు లేదా వివాహ ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది.
పన్ను మినహాయింపు ప్రయోజనం
సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80(C) కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. జాబ్ చేసే వారికి ఈ స్కీం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.