హైదరాబాద్‌లో ఉగ్రవాదల ముుఠాలు మకాం వేసిన విషయం మధ్యప్రదేశ్, గుజరాత్ నుంచి వచ్చిన వారు చెప్పే వరకూ ఎవరికీ తెలియడం లేదు. తెలంగాణలో ఇంటలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అవుతుందో లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలకు కోపం వస్తుందని చూసీ చూడనట్లుగా ఉంటున్నారో కానీ బ యట రాష్ట్రాల నుంచి వచ్చిన వారు.. అనుమానిత ఉగ్రవాదుల్ని పట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి… తెలంగాణలో టెర్రరిస్టు కార్యకలపాలకు పాల్పడుతున్న వారిని గుజరాత్ ఓటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నుంచి ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం ప్లాన్లు
ఎస్ కేపీ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలక సూత్రధారి సుమేరా భానును గుజరాత్ ఏటీఎస్ విచారిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ లలో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు విచారణలో తేలింది. ఇటీవల సుమేరా భాను మాడ్యుల్ సభ్యులు గుజరాత్ ఏటీఎస్ కు దొరికిపోయారు. హైదరాబాద్ టోలిచౌకీకి చెందిన ఖతిజా వారికి ఆన్ లైన్ లో టచ్ లోకి వచ్చినట్లుగా గుర్తించారు. ఖతిజాతో కలిసి హైదరాబాద్ లో కుట్ర చేసేందుకు స్కెచ్ వేసినట్లు గుజరాత్ ఏటీఎస్ విచారణలో తేలింది. ఐఎస్ కేపీ మాడ్యుల్ లో గుజరాత్ ఏటీఎస్ లో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే పలుచోట్ల సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు.
అసలు స్కెచ్ వేసింది సుమేరా భాను
గుజరాత్ ఏటీఎస్ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కీలక నేతగా ఉన్నటువంటి సుమేరా భానును ప్రస్తుతం బోరుబందర్ లో ఉన్న హోటల్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం ఆమె ఐఎస్ కేపీ మాడ్యుల్ మేడ్ ఆఫ్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ కొసర్కాన్ ప్రావీన్స్ అనే ఇస్లామిక్ సంబంధించిన ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యురాలిగా ఆమె కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొంతమంది సభ్యులతో ఆమె సంప్రదింపులు జరిపారు. ఆఫ్ఘనిస్తాన్ ను స్పెషల్ స్టేటస్ ఇస్లామిక్ రాజ్యం స్థాపన కోసం వీరందరూ బోరుబందర్ నుంచి జలమార్గం ద్వారా దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు.
పక్కాగా మాటు వేసి పట్టుకున్న గుజరాత్ ఏటీఎస్
వీరంతా ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ చేరేందుకు బోటు ద్వారా వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారంటూ గతంలో జూన్ 10వ తేదీన గుజరాత్ ఏటీ ఎస్ అధికారులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర కొన్ని ఆధారాలు సేకరించారు. వారు ఇచ్చిన సమాచారాన్ని బట్టి హైదరాబాద్ లో ఇటీవల మూడు రోజుల క్రితం వరంగల్ తో పాటు పెద్దపల్లి, హైదరాబాద్, కడప పోలీస్ స్టేషన్ లలో సోదాలు చేసి పలువురిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఇటీవల తెలంగాణలో ఇలా తరచూ ఉగ్రవాద వ్యవహారాలకు పాల్పడేవారిని పట్టుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పోలీసులు పట్టుకుంటున్నారు కానీ.. తెలంగాణ పోలీసులు ఒక్క టెర్రరిస్టు కేసును కూడా చేధించలేకపోతున్నారు