అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే బాహుబలికి ముందు ఆ తర్వాత అని చెప్పుకోవాలి. ఆ మూవీతో టాలీవుడ్ కి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన రాజమౌళి RRR తో రీసౌండ్ మరింత పెంచి ఆస్కార్ వేదికపై నిలబెట్టాడు. అలాంటి జక్కన్నకు అరుదైన గౌరవం దక్కింది. గ్రామీణ స్థాయి నుంచి క్రికెటర్స్ ప్రతిభను ప్రోత్సహించేందుకు రూపొందిన ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్(ISBC) చైర్మన్‌గా రాజమౌళి నియమితులయ్యారు.
ISBC చైర్మన్‌గా జక్కన్న
ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఎన్ని సినిమాలు తీశాం, ఎంత సమయం తీసుకున్నాం అన్నది కాదు కొట్టిన ప్రతిబాల్ సిక్సర్ కొట్టి చూపించాడు జక్కన్న. ఒకప్పుడు తెలుగు సినిమా, తెలుగు నటులంటే ఎంతో చిన్నచూపు చూసే నార్త్ స్టార్స్ అంతా ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నారంతా అంతా రాజమౌలి చలవే. బాహుబలి, RRR తో తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిన పోయిన జక్కన్నకు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు. ఏంటా రోల్ అంటే ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్(ISBC) చైర్మన్‌గా రాజమౌళి నియమితులయ్యాడు. గ్రామీణ స్థాయి నుంచి క్రికెటర్స్‌గా ఎదగాలనుకునే వారిని గుర్తించి.. వారిలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ గైడెన్స్‌లో ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ ఏర్పాటైంది. ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు, సదుపాయాలు లేక ఎదురు చూస్తున్న ఎందరికో అండగా నిలుస్తోంది ఐఎస్బీసీ. దేశం మొత్తం దాదాపు పాతిక కోట్ల మంది విద్యార్థులను టీమ్స్‌ను విభజించి పలు టోర్నమెంట్స్ ద్వారా ఎంకరేజ్ చేస్తోన్న ISBC కి చైర్మన్ గా నియమితులయ్యారు రాజమౌళి.
మహేశ్ బాబుతో జక్కన్న నిధుల అన్వేషణ
RRR తర్వాత మహేశ్ బాబుతో సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు రాజమౌళి. SSMB 29గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన క్రేజ్ తో జక్కన్న తర్వాత సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నెక్ట్స్ మూవీని ఎలా చేస్తారనే దానిపై ఎంటైర్ వరల్డ్ ఆసక్తిగా గమనిస్తోంది. అందుకే ఆయన SSMB 29 విషయంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇందులో భగంగా SSMB 29 సినిమాను పాన్ ఇండియా మూవీ కంటే పాన్ వరల్డ్ మూవీగానే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్స్‌తో పాటు హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇందులో నటించబోతున్నారని టాక్. ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో నిధుల అన్వేషణలో ఈ మూవీ సాగనుందని టాక్.