గుంటూరు తూర్పులో వైసీపీకి గండం – పరువు తీస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా !

గుంటూరు వైసీపీలో ముస్తఫా రచ్చ మామూలుగా లేదు. ఆయన తన కోసం పార్టీని బద్నాం చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మేయర్ వర్గాన్ని చులకన చేసి తన కుమార్తెకు ఎమ్మెల్యే సీటు ఇప్పించుకునేందుకు ఆయన పార్టీకి చెడ్డపేరు వచ్చేలా చేస్తారని అంటున్నారు. గుంటూరు తూర్పు ఎంఎల్ఏ ముస్తాఫా, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు మధ్య కొంత గ్యాప్ ఉంది. .గుంటూరు కార్పోరేషన్ పరిధిలో మొత్తం మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు పూర్తిగా నగర పాలక సంస్థ పరిధిలోకి వస్తాయి. వైసీపీ పార్టీ అధికారంలో లేని సమయంలో ముస్తఫా, కావటి మనోహర్ నాయుడు మధ్య సఖ్యత ఉండేది. కానీ మేయర్ సీటు చిచ్చు పెట్టింది.

తన వర్గానికి మేయర్ సీటు కావాలంటున్న ముస్తఫా

గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని చెరి రెండున్నర సంవత్సరాలు ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలకు కేటాయించారు. మొదటి రెండున్నర సంవత్సరాలు కావటి మనోహర నాయడు…మరో రెండున్నర సంవత్సరాలు రమేష్ గాంధీకి కేటాయించారు. అనారోగ్యంతో రమేష్ గాంధి మరణించారు. మనోహర్ కు కేటాయించిన రెండున్నర ఏళ్ళ పదవీ కాలంపూర్తి అయింది. మేష్ గాంధీ చనిపోయాడు కనుక మనోహర్ నే మేయర్ గా కంటిన్యూ అవుతున్నారు. అప్పటి నుంచి ఈస్ట్ ఎంఎల్ఏ ముస్తాఫా కు మేయర్ మనోహర్ నాయుడికి మద్య విభేధాలు పొడచూపాయి. మేయర్ ను మార్చే దిశగా ముస్తాఫా ప్రయత్నం ప్రారంభించారు..తన నియోజక వర్గ పరిధిలో ఉన్న కార్పొరేటర్లతో అసమ్మతి గళం వినిపించేందుకు సిద్ద మయ్యారు .

మస్తఫా సీటు కోసం డిప్యూటీ మేయర్ ప్రయత్నాలు

వరుసగా రెండు సార్లు ముస్తాఫా ఈస్ట్ నియోజకవర్గం ‌నుంచి విజయం సాధించారు.. మూడవ సారి సీటు దక్కటం కష్టమన్నట్లు టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో‌ వ్యతిరేకత పెరిగిందంటున్నారు. ఇది గమనించిన ముస్తాఫా ఇక తాను పోటీ చేయనని ఆ సీటు తన కుమార్తెకు ఇవ్వాలని సీయం వద్ద ప్రపోజల్ పెట్టారు. అయితే డిప్యూటీ మేయర్ సజీలా ఈస్ట్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముస్తాఫా కుమార్తె కంటే తను అన్ని విధాల ముందంజలో ఉన్నానని చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు గమనిస్తున్న ముస్తాఫా మీడియాని ఎట్రాక్ట్ చేసి ప్రజలలో తన పేరు నలిగేలా నగర పాలక సంస్థ సమావేశాలను ఒక రేంజ్ లో వాడుకొనే ప్రయత్నం చేసారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

ముస్తఫాపై జగన్ తీవర్ ఆగ్రహం ?

ముస్తఫా సొంత ఇమేజ్ కోసం పార్టీని పణంగా పెడుతున్నారన్న నిర్ణయానికి రావడంతో హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు ఈసారి సీటు లేదని.. కుమార్తెకు కూడా చాన్సివ్వకూడదన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో ముస్తఫా మరో ప్లాన్ ఆలోచిస్తున్నారు. వేరే పార్టీలో చేరుతాననే సంకేతాలు పంపిస్తున్నారు. దీనిపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.