రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం అనేక పథకాలు ప్రవేశ పెడుతూనే ఉంది. తా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం లోని కేంద్ర సర్కార్ రైతుల కోసం ఇప్పుడు ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తోంది. ప్రధాన మంత్రి ప్రణామ్ స్కీమ్‌గా పిలిచే ఈ స్కీము రైతులకు సేంద్రీయ ఎరువులు అందిస్తుంది. ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ యోజన స్కీమ్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు.
సేంద్రీయ ఎరువులు రైతులకు అందించడం లక్ష్యం
సేంద్రియ ఎరువు అన్నది సూక్ష్మ జీవులను కలిగి ఉండే పదార్థం. దీనిని విత్తనాలు, మొక్కలు, నేలలో ప్రయోగించడం ద్వారా వాటికి సహజ పోషకాలను అందించడమే కాక. త్వరగా వాటి ఎదుగుదలకు తోడ్పడుతుంది. బయో ఎరువులంటే రసాయన ఎరువులు కాదు. రసాయన ఎరువులు నేరుగా భూమి సారాన్ని అధికం చేస్తాయి. అయితే సేంద్రియ ఎరువులు నేరుగా ఆ పని చేయవు. అవి భూమి సారవంతం ప్రక్రియను సహజసిద్ధంగా ప్రకృతి విధానంలో చేస్తుంది.
మిగిలిన సబ్సిడీ రైతులకే పంపిణీ
బయో ఎరువులు, సేంద్రీయ ఎరువుల తో కలిపి ఎరువుల సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ పీఎం ప్రణామ్ స్కీమ్ ప్రధాన లక్ష్యం. ఇలా చేయడం వల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది . ఇలా తగ్గడం వల్ల ఆదా ఆయ్యే సబ్సిడీ మొత్తాన్ని రైతులకు ప్రయోజనాలు కల్పించేందుకు రాష్ట్రాలకే ఇస్తారు. 50 శాతం ఆదా చేసే రాష్ట్రాలకు గ్రాంట్ గా పంపిస్తారు. రాష్ట్రాలు ఎరువుల సబ్సిడీని పొదుపు చేసినట్లయితే ఆ రాష్ట్రాలకు గ్రాంట్ ఇస్తారు. గ్రాంట్‌లో 70 శాతం గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిలలో ప్రత్యామ్నాయ ఎరువులు వంటి వాటి కోసం వాడాలి. మిగిలిన 30 శాతాన్ని రైతులు, పంచాయతీలు, రైతు ఉత్పత్తి సంస్థలు, ఎరువుల కోసం అలానే అవగాహనా కోసం వాడాల్సి వుంది.
రసాయన ఎరువుల వాడకం తగ్గించడం లక్ష్యం
రసాయన ఎరువుల వాడకం వ్యవసాయనికి పెనుముప్పుగా మారింది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రసాయన ఎరువులపై ప్రభుత్వం రూ.2.25 లక్షల కోట్ల సబ్సిడీ అందజేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇందులో సేంద్రీయ ఎరువల వల్ల లక్ష కోట్ల సబ్సీడీని తగ్గిస్తే ఆ మొత్తాన్ని ఇతర మార్గాలలో రైతులకు ప్రయోజనం కల్పించవచ్చు. ఈ లక్ష్యం అమలు రాష్ట్రాల చేతుల్లోనే ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా సేంద్రీయ ఎరువుల లక్ష్యాన్ని అందుకుంటే అంత ఎక్కువగా లాభం మిగులుతుంది.