అమెరికాలో విష్ణువర్ధన్ రెడ్డి టూర్ – ఏపీలో బీజేపీ విజన్‌పై ప్రవాసాంధ్రులకు అవగాహన !

ఏ దేశమేగినా ఎందుకాలిడినా .. మాతృభూమి అభివృద్ధి కోసం ప్రవాసాంధ్రులు తపిస్తూ ఉంటారు. తమ సంపాదనలో ఎంతో కొంత స్వచ్చందంగా కేటాయిస్తూ ఉంటారు. పైకి ఎన్ని రాజకీయాలు ఉన్నప్పటికి అంతర్గతంగా వారంతా తమ రాష్ట్ర అభివృద్దిని ప్రజా ప్రయోజనాల్నే కోరుకుంటారు. అక్కడ ఉన్న తెలుగు సంఘాల ఆహ్వానం మేరకు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. వివిధ తెలుగు సంఘాలతో సమావేశమై.. ప్రవాసాంధ్రులకు ఏపీ విషయంలో బీజేపీ విజన్ గురించి వివరించనున్నారు.

ఏపీ అభిృవృద్ధిపై ప్రవాసాంధ్రులకు ప్రత్యేకమైన ఆసక్తి

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ది కీలక పాత్ర. ఈ విషయంలో ప్రవాసాంధ్రులకు స్పష్టమైన అవగాహన ఉంది. అంతా విద్యావంతులే కావడంతో .. నిజానిజాలు తెలుసు. అందుకే బీజేపీ ఏమైనా విషయంలో ఏపీకి చేయాల్సింది చేయకపోతే ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో బీజేపీ ఎప్పుడూ ప్రజాస్వామ్యయుతంగానే ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఏపీకి రావాల్సిన నిధులు రాలేదని దృష్టికి వస్తే.. ఏపీ బీజేపీ స్వయంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్తుంది. ఇటీవలి కాలంలో కేంద్రం ఇచ్చిన అనేక ప్రయోజనాల వెనుక ఏపీ బీజేపీ కృషి ఉంది.

పలు తెలుగు సంఘాల సమావేశాల్లో పాల్గొననున్న విష్ణువర్ధన్ రెడ్డి

ప్రవాసాంధ్రులు అనేక మంది పార్టీలకు అతీతంగా తమ స్వగ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల్లో అభివృద్ధి పనులకు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఆస్పత్రులు సహా వివిధ సామాజిక సేవ విషయాల్లో సాయాలు అందిస్తుున్నారు. ఇలాంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి సహకారం అందాలన్న విషయంలో పూర్తి స్థాయిలో వారికి ఉన్న సందేహాలను విష్ణువర్ధన్ రెడ్డి నివృతి చేసే అవకాశం ఉంది.

రాజకీయ గ్రూపులు ఉన్నా… తెలుగు వాళ్లు వస్తే అందరూ ఒక్కటే !

రాజకీయాలు ఎలా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా అమెరికా వచ్చారంటే అందరూ సాదరంగా ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రెండు వారాలకుపైగా విష్ణువర్ధన్ రెడ్డి అమెరికాలో వివిధ నగరాల్లోని తెలుగు సంఘాల ఆహ్వానం మేరకు పర్యటించనున్నారు. ఏపీ విషయంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న విజన్.. అందు కోసం చేస్తున్న ప్రయత్నాలు .. అన్నింటినీ ప్రవాసాంధ్రుల ముందు ఉంచనున్నారు విష్ణువర్ధన్ రెడ్డి