జాతకంలో కాల సర్పదోషం ఉన్నా, నిత్యం కలలో పాములు కనిపిస్తూ భయపెడుతున్నా దానికి ఒకే ఒక పరిష్కారం కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయ దర్శనం అని చెబుతారు పండితులు. ఆ దేవాలయం ప్రత్యేకత ఏంటో చూద్దాం.
దక్షిణ కన్నడ ప్రాంతంలో మంగళూరుకి 105 కిలోమీటర్ల దూరంలో కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంటుంది. పురాణ గాధ ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసురుని,శూరపద్మాసురుని సంహరించిన తర్వాత తన అన్న వినాయకుని ఇతర దేవతలనీ వెంటబెట్టుకుని కుమార పర్వతం చేరుకున్నాడు. దేవతలంతా సుబ్రహ్మణ్యుని విజయానికి పుష్పవర్షం కురిపించారు. ఇంద్రుడు తన కూతురు దేవసేనను కుమార స్వామికిచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మాది దేవతలంతా కుమారస్వామికి దివ్య మంత్ర జలాలతో అభిషేకించారు. అదే ఆ క్షేత్రంలో ఉన్న కుమార ధార. కర్ణాటక రాష్ట్రం ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి పట్టణంలో ఉన్న ఈ దేవాలయంలో భక్తులకు” వల్మీక మృత్తికా” అంటే పుట్ట మన్ను ప్రసాదంగా అందిస్తారు.
పుట్టమన్నును ప్రసాదంగా అందిస్తున్నారు సరేకానీ మరి మట్టిని తినరు కదా ఆ ప్రసాదం ఏం చేయాలనే సందేహం రావొచ్చు.ఆ ప్రసాదాన్ని ఎలా వినియోగించాలంటే.. ఈ ప్రసాదాన్ని ధరించిన వారికి నాగుల భయం, నాగదోషం తొలగి నాగదేవతల అనుగ్రహం ఉంటుంది. కొందరికి నిత్యం కలలో పాములు కనిపిస్తుంటాయి ఎన్నిచేసినా ఆ భయం అలాగే ఉండిపోతుంది అలాంటివారు ఈ ఆలయంలో మృత్తికా ప్రసాధాన్ని తీసుకుంటే ఆ భయం దరిచేరదంటారు. సంబంధాలు కుదరని వారు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుని వచ్చి చిటికెడు మృత్తికను, కొంచెం పసుపును నీటిలో వేసుకుని స్నానమాచరించి దేవుడికి నేతితో దీపాన్ని వెలిగించి ప్రార్థిస్తే త్వరగా వివాహం జరుగుతుందంటారు. ఈ స్వామివారి సన్నిధిని నుంచి తీసు
ఊరికే వసపిట్టలా వాగుతుంటారు కొందరు..పుట్టుకతో వచ్చిన లక్షణమో ఏమో ఎంత కంట్రోల్ చేసినా వారి మాటలు ఆపడం ఎవ్వరి వల్లా కాదు. ఓ చిటికెడు మృత్తికను కొబ్బరినూనెలో వేసి తలకు రాసుకుంటే అతిగా మాట్లాడటం తగ్గుతుందట. పిల్లలు చాలామంది పళ్లు కొరకడం, చీటికి మాటికీ కిందపడి కొట్టుకోవడం, అలాగే ఓ వైపు చూస్తుండిపోవడం, అదే పనిగా ఏడుస్తుండడం, ఎంత తింటున్నా సన్నబడడం లాంటి లక్షణాలుంటే సుబ్రమణ్యస్వామిని ధ్యానించి ఆ మృత్తికను తీసుకుని బొట్టుగా పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారట. రుతుక్రమం సమయంలో కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న వారు రుతుక్రమం వచ్చేముందు చిటికెడు మృత్తికను పొడిచేసి కొబ్బరినూనె లేదా ఆముదంలో వేసుకుని పొడిచేసుకుని పొట్టపై రాసుకుంటే ఆ నొప్పి రాదని చెబుతారు. ఇంకా చెప్పాలంటే మతిమరుపు, సంతానలేమి, చర్మ అతిగా పొడిబారి పెళుసులు ఊడడం ఇలాంటి ఎన్నో సమస్యలకు ఆ మట్టి అద్భుతమైన ఔషధం అని విశ్వసిస్తారు.
నోట్: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు, స్థానిక కథనాల ఆధారంగా రాసిన వివరాలివి. వీటిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.