భారత రాష్ట్ర సమితి లో ఇప్పుడు అసంతృప్తి బద్దలవడానికి సిద్ధంగ ాఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అవసరం లేకపోయినా ప్రతిపక్షాల్ని నిర్వీర్యం చేయడానికి ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు. ఇప్పుడు ఆ ఫిరాయింపులే పార్టీకి గుదిబండగా మారాయి. నమ్మి తన వెంట వచ్చిన నేతల్ని వదులుకోవాల్సి వస్తోంది. పదవులు, నిధులకు ఆశపడి గెలిచి నపార్టీని వదిలి వచ్చిన వారికే ప్రాదాన్యత ఇవ్వాల్సి వస్తోంది. దాంతో ఇప్పటి వరకూ కేసీఆర్ ను నమ్ముకున్న వారు మోసం చేశారన్న బాధతో దూరం జరుగుతున్నారు.
అవసరం లేని ఫిరాయింపులోత సమస్యలు తెచ్చుకున్న కేసీఆర్
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించినా కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేల్ని ఫిరాయించేలా చేసుకున్నారు. ఆ పన్నెండు చోట్ల టీఆర్ఎస్ తరపున పని చేసిన నేతలు పక్క చూపులు చూస్తున్నారు . ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో వర్గ పోరాటం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేసీఆర్ మొదటే టిక్కెట్ హామీ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్, టీడీపీ ఎల్పీలను సైతం టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ సిట్టింగ్‌లకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ల వైపు బీఆర్ఎస్ నేతల చూపు
బీఆర్ఎస్ ఓడిపోయిన ప్రతీ చోటా బలమైన అభ్యర్థులు ఉన్నరు. పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహా ఫిరాయించిన ఎమ్మెల్యే ఉన్న ప్రతీ చోటా బలమైన బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వారంతా ఇప్పుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నిన్నామొన్నటి వరకూ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఏదో ఓ పదవి ఉంటుందని నేతలు అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీలో చాన్స్ ఉంటుంది. రెండు పార్టీలూ నేతలకు వల వేస్తున్నాయి. ఆఫర్లతో రెడీగా ఉన్నాయి . అందుకే ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చోట బీఆర్ఎస్ నేతలంతా ప్రత్యామ్నాయం చూసుకోాల్సిందే.
చేతులెత్తేసే పరిస్థితిలో కేసీఆర్
ఇటీవల మహేందర్ రెడ్డిని పిలిచి కేసీఆర్, కేటీఆర్ బుజ్జగిస్తే… ఆయన నిర్మోహమాటంగా టిక్కెట్ ఇస్తే ఉంటాలేకపోతే లేదని చెప్పేశారని అంటున్నారు. ఎన్నికల్లో పాల్గొనే స్టామినా ఉన్న నేతల్ని… నామినేటెడ్ పోస్టులతో కట్టడి చేయాలనుకోవడం సాధ్యం కాకపోవచ్చు.. గ్రేటర్ పరిధి, ఖమ్మం వంటి చోట్ల ఇప్పుడు బీజేపీ కూడా బీఆర్ఎస్ నేతలకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. . ఫిరాయింపు దార్లను ప్రోత్సహించిన నియోజకవర్గాల్లో ఉన్న ఈ అసంతృప్తి బయటపడితే బీఆర్ఎస్‌లో సంక్షోభం మరింత ముదురుతుంది.