ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా బీజేపీ పాత్ర ఉంటుందని ఆ పార్టీ నేతలు కొద్ది రోజులుగా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లోనూ ఆంధ్రప్రదేశ్ లో గాలి మారుతోందని, కమలం గుభాళిస్తోందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మోదీ తొమ్మిదేళ్ల పాలన పై బహిరంగ సభలు జరుగుతున్నాయని చెప్పారు. నిజాలను గుప్పెట్లో పెట్టి ఎంతో కాలం ఆపలేరంటూ ఆయన జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం వేస్తోన్న స్టిక్కర్లు ఎంతో కాలం నిలవన్నారు. బీజేపీ హైకమాండ్ ఏదో మాస్టర్ ప్లాన్ లో ఉందని.. ఆ కాన్ఫిడెన్స్ రాష్ట్ర నేతల్లో కనిపిస్తోందని అంటున్నారు.
కేంద్ర నిధులపై ప్రజలకు నిజాలు అర్థమవుతున్నాయా ?
ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు చేసిన మేళ్ల గురించి ఏపీ బీజేపీ ఇంటింటికి ప్రచారం చేస్తోంది. నెల రోజులుగా ఈ ప్రచార ఉద్యమం సాగుతోంది. ఆయుష్మాన్ భవతో ప్రాణం నిలుపుకున్న కుటుంబాలు . ప్రతీ చోటా కనిపిస్తున్నాయి. పీఎం కిసాన్ అందుకున్న రైతులు – నానో యూరియాతో పంట పండించుకున్న అన్నదాతలు .. రూ. 10 వేల రుణం పొందిన చిరు వ్యాపారులు.. టిడ్కో ఇళ్లు అందుకున్న లబ్దిదారులు దాదాపుగా ప్రతీ ఊరులో ఉన్నారు. సెంట్ స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటున్న వారు – ఉచిత రేషన్ బియ్యం పొందిన వారు.. ఇలా చెప్పుకుంటూ పోతే … ఏపీలో 90 శాతం ప్రజలు లబ్దిదారులేనని అంటున్నారు . వీరందరి వద్దలకు బీజేపీ నేతలు వెళ్తున్నారు. కేంద్రం చేస్తున్న మేళ్ల గురించి చెబుతున్నారు.
స్టిక్కర్లు తీసేసే సమయం వచ్చిందని ప్రజలకు అర్థం అయిందా ?
ఇంత కాలం వారందరికీ తామే ఏదో చేస్తున్నామన్న భ్రమ కల్పిచంిన పాలకుల కుట్రల్ని నెల రోజులుగా ఇంటింటికి తీసుకెళ్తున్నామని బీజేపీ నేతలుచెబుతున్నారు. రెండు రాష్ట్ర స్థాయి బహిరంగసభలు, జిల్లాల వారీగా సభలు.. నియోజకవర్గాలు…. మండలాల వారీగా సమావేశాలు పెట్టి ప్రజలకు వాస్తవాలు చెబుతున్నామని అంటున్నారు. ప్రజల్లో వస్తున్న మార్పును ప్రత్యక్షంగా చూస్తున్నామని ఆ పార్టీ నేతలుఅంటున్నారు. రెండు ప్రాంతీయ పార్టీలు కేంద్రం ఇచ్చే నిధుల్ని సగం దుర్వినియోగం చేసి.. సగం పథకాలకు వాడుతున్నాయన్న విషయం ప్రజలకు అర్థమవుతోందని.. ప్రాంతీయ పార్టీలతో పనేంటనే ఆలోచన ప్రజల్లో వస్తోంది. దీనిపై ఏపీ బీజేపీ చైతన్యం తీసుకు వస్తోందని చెబుతున్నరాు. మూడో సారి మోదీ ప్రధాని కావడం ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్ గా ఏపీలో కూడా వస్తోందని అంటున్నారు.
కేంద్రం మద్దతు లేకుండా నడవని ప్రభుత్వాలు ఇక బీజేపీ ప్రభుత్వంలో ఉంటే ?
ఏపీ విషయంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. రెండు బహిరంగసభలు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడమే దీనికి సాక్ష్యమని చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ హైకమాండ్ అంత కంటేముందు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టాల్సి ఉంది. వాటి సంగతి తేల్చిన తర్వాత ఏపీలో ఎన్నికలపై దృష్టి సారించనున్నారు. పొత్తులు పెట్టుకోవాలా.. పెట్టుకుంటే ఎవరితో… అనేదానిపై అప్పుడే డిసైడ్ చేయనున్నారు. ఇప్పటికే రాజకీయ పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చారని అంటున్నారు. బీజేపీ అగ్రనేతలు ఇచ్చిన భరోసాతోనే … రాష్ట్ర నేతల్లో కూడా బీజేపీకి డబుల్ ఇంజిన్ సర్కార్ అన్న భావన వచ్చిందని చెబుతున్నారు.